Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Jul-2016 11:48:40
facebook Twitter Googleplus
Photo

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు కొద్దిరోజులుగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ?జనతా గ్యారెజ్? సినిమాకు సంబంధించిన ఫస్ట్ టీజర్ నిన్న సాయంత్రం 6 గంటలకు విడుదలైన విషయం తెలిసిందే. ?మిర్చి?, ?శ్రీమంతుడు? లాంటి బ్లాక్‌బస్టర్స్ అందించిన దర్శకుడు కొరటాల శివతో కలిసి ఎన్టీఆర్ చేసిన ఈ సినిమా మొదట్నుంచే మంచి ఆసక్తి రేకెత్తిస్తూ వస్తోంది. ఇక నిన్న విడుదలైన టీజర్‌తో ఈ సినిమాపై ఉన్న అంచనాలన్నీ తారాస్థాయికి చేరిపోయాయి.
దర్శకుడు కొరటాల శివ ఎప్పట్లానే తన బలమైన కథాంశాన్ని, అంతే బలమైన సంభాషణలతో ఓ కథగా చెప్పినట్లు టీజర్ చూస్తే స్పష్టంగా తెలుస్తోంది. అంతా అనుకున్నట్లుగానే అభిమానుల అంచనాలను అందుకున్న ఈ టీజర్ యూట్యూబ్‌లో వ్యూస్ పరంగా దూసుకుపోతోంది. కేవలం ఆరు గంటల్లోనే 1 మిలియన్ వ్యూస్ సాధించిన ఈ టీజర్, తెలుగులో టీజర్స్ విషయంలో ఓ సరికొత్త రికార్డు సృష్టించింది. ఇక టీజర్‌కు వచ్చిన రెస్పాన్స్‌తో మరింత ఉత్సాహంతో జనతా గ్యారెజ్ టీమ్ ఆడియో విడుదలకు సిద్ధమవుతోంది. ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ ప్రధాన పాత్రలో నటించారు

,  ,  ,  ,  ,