Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Jul-2016 12:18:30
facebook Twitter Googleplus
Photo

యూన్గ్ టైగర్ ఎన్టీఆర్ తాజా గా నటిస్తున్న జనతా గ్యారేజ్ చిత్రం నిన్ననే హైదరాబాద్ లో క్లైమాక్ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పై భారీ స్థాయి లో అంచనాలు ఉన్నాయి.క్లైమాక్ చిత్రీకరణ పూర్తవడం తో రెండు పాటలు మినహా మిగిలిన భాగమంతా చిత్రీకరణ పూర్తయినట్లైంది. ఈ రెండు పాటలను ఈ నెలలోనే జరుగబోయో తదుపరి షెడ్యూల్ లో చిత్రీకరించనున్నారు. హైదరాబాద్ మరియు కేరళ లో ఈ పాటల చిత్రీకరణ జరుగనుంది.
ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ యూట్యూబ్ లో సంచలనం రేపుతోంది. ఈ టీజర్ చిత్రం పై అంచనాలను మరింత పెంచిందనే చెప్పాలి. సమంతా, నిత్యామీనన్ లు కథానాయికలు గా నటిస్తున్నారు. మలయాళం నటుడు మోహన్ లాల్ ఓ ప్రముఖ పాత్ర ను పోషిస్తున్నాడు.దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 12 న విడుదల కాబోతోంది.

,  ,  ,  ,  ,  ,