Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Aug-2016 16:02:02
facebook Twitter Googleplus
Photo

ఎన్టీఆర్ ? కొరటాల శివ కలయికలో తెరకెక్కుతోన్న చిత్రం జనతా గ్యారేజ్. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఎన్టీఆర్ సినిమా అంటే డ్యాన్స్, డైలాగ్స్ కి కొదవే ఉండదు. గ్యారేజ్ కోసం సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ అదిరిపోయే ఐటమ్ సాంగ్ ని రెడీ చేశాడు. ఈ సాంగ్ లో ఎన్టీఆర్ సరసన చిందేయడం కోసం ముద్దుగుమ్మ కాజల్ ని తీసుకొన్న విషయం తెలిసిందే. ఇందుకోసం కాజల్ కి భారీగాని ముట్టజెప్పినట్టు తెలుస్తోంది.

ఈ ఐటమ్ షూటింగ్ ఈ నెల 17 నుంచి చిత్రీకరించనున్నారు. ఇందుకోసం హైదరాబాద్ లో అదిరిపోయే సెట్ ని రెడీ చేశారు. రెండు, మూడు రోజులు ఈ పాట కోసం టైమ్ కేటాయించబోతోంది కాజల్. ముద్దుగా గ్యారేజ్ ఐటమ్ తమన్నా అనుకొన్నారు. కానీ.. కాజల్ తో ఐటమ్ పాట చేయించడానికి స్వయంగా ఎన్టీఆర్ ఆసక్తి కనబర్చడంతో.. ఆ అవకాశం కాజల్ కి దక్కినట్టు సమాచారమ్. ఐటమ్ సాంగ్ లో ఎన్ టీఆర్ ? కాజల్ ఏ రేంజ్ లో రెచ్చిపోనున్నారనేది చూడాలి.

,  ,  ,  ,  ,  ,  ,  ,  ,