Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Aug-2017 12:55:57
facebook Twitter Googleplus
Photo

సినిమానే కాదు దాదాపుగా మన దేశంలో సినిమాలు అన్నీ బాక్స్ ఆఫీసు వద్దగాని జనాలలోకి ఒక సినిమా వెళ్ళాలి అన్న ఆ సినిమా హీరోనే ఆదారం. కానీ ఈ మధ్య మన ప్రేక్షకులు క్రియేటివ్ టీమ్ ఎవరు అని తెలుసుకొని వస్తున్నారు. ఇప్పుడు తెలుగు విడుదల కాబోతున్న జయ జానకి నాయక సినిమా కూడా హీరో విలువ కన్నా డైరెక్టర్ ఇమేజ్ ఎక్కువగా ఉండడంతో ఈ సినిమాను ప్రచారం ఆ డైరెక్టర్ పేరుతోనే జరుగుతుంది. అవ్వడానికి చిన్న హీరో సినిమా అయన ప్రచారం మార్కెట్ లో అది చేస్తున్న హడావుడి చేస్తుంటే స్టార్ హీరో రేంజ్ లో నడుస్తుంది.

బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన ‘జయ జానకి నాయక’ సినిమా సాటిలైట్ డీల్ తెలిస్తే మరో సారి షాక్ అవుతారు అందరూ. బోయపాటి ట్రేడ్ సినిమాకు మన తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కూడా మంచి డీల్ కుదుర్చుకుంది. ఇప్పుడు సాటిలైట్ రైట్స్ కూడా అందరినీ ఆశ్చర్య పరిచే విదమైన ఒప్పందం జరిగింది. ట్రేడ్ టాక్ ప్రకారం తెలుగులో సాటిలైట్ రైట్స్ ని స్టార్ మా టివి 5 కోట్లు కు హింది డబ్బింగ్ వెర్షన్ కు సోని నెట్ వర్క్ 7 కోట్లకు డీల్ సెట్ చేసుకున్నారు అని చెబుతున్నారు. నార్త్ ఇండియాలో బోయపాటి కమర్షియల్ ఎమోషన్ కు మంచి క్రేజ్ ఉంది. బోయపాటి సినిమాలుకు అక్కడ టిఆర్ పి కూడా బాగానే వస్తూ ఉంటుంది. అతను డైరెక్ట్ చేసిన సర్రైనోడు సినిమా కూడా హింది ప్రేక్షకుల టివిలో పిచ్చి పిచ్చిగా చూసేశారు. దానితో ఇప్పుడు జయ జానకి నాయక సినిమా డీల్ కూడా మంచి ధర పలికింది. ఆ విధంగా బోయపాటి దెబ్బకి రైట్స్ ఇలా టాప్ రేట్స్ కు లేచాయనే చెప్పొచ్చు.

బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన జయ జానకి నాయక సినిమా ఆగష్టు 11 న విడుదల అవుతుంది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందించాడు. ప్రచారంలో మాత్రం యాక్షన్ లవ్ తో సినిమా అదిరిపోతుంది చెబుతున్నారు.

,  ,  ,  ,