Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Nov-2016 10:52:50
facebook Twitter Googleplus
Photo

ఇప్పుడు టీవీ యాంకర్లు కూడా స్టార్ల మాదిరిగా ఇమేజ్ వచ్చేస్తోంది కానీ.. ఇలా యాంకర్లకు స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన వారిలో ఝాన్సీ కూడా ఉంటుంది. తన వెర్సటైల్ యాంకరింగ్ స్కిల్స్ తో ఆకట్టుకున్న ఈమె.. సినిమాల్లో కూడా యాక్టింగ్ ట్యాలెంట్ తో మెప్పించింది. కానీ.. ఝాన్సీకి కొందరు దర్శకులతో వివాదాలు ఉన్నాయనే టాక్ ఉంది.

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తనే చెప్పింది. చాలామందికి మార్గనిర్దేశం కూడా చేసిందిట. 'ఏమైంది ఈ వేళ మూవీలో.. ఓ కేరక్టర్ నన్ను దానికి బుద్ధి లేదు అంటుంది. కానీ నేను దీన్ని వ్యతిరేకించాను. దాన్ని అనడం కరెక్ట్ కాదని.. అది న్యూట్రల్ పదం అని.. స్త్రీలింగం ఇండికేట్ చేసేలా ఆవిడను అని మార్పించాను. దర్శకుడు సంపత్ నంది కూడా ఏ మాత్రం అభ్యంతరం వ్యక్తం చేయలేదు' అని చెప్పింది ఝాన్సీ.

ఆర్ నారాయణ మూర్తితో కూడా ఓసారి గొడవ వచ్చింది. 'నాది ఆ సినిమాలో పూర్తి స్థాయి పాత్ర. నేను సెట్స్ లో అందరితో నవ్వుతూ ఉంటాను. దీనికి ఆయన నా కేరక్టర్ ట్రిమ్ చేసేసి.. క్లైమాక్స్ లో అసలు లేకుండా చేశారు. దీంతో నేను సెట్స్ నుంచి వాకౌట్ చేసేశా. కనీసం డబ్బింగ్ కూడా చెప్పలేదు. ఆ తర్వాత ఎప్పుడూ రాజీకోసం యత్నించలేదు' అని చెప్పింది ఝాన్సీ. అయితే.. తనకు గొడవ వచ్చిన దర్శకులతో మళ్లీ పని చేయడానికి రెడీనే అని.. అలా అయితే.. తన నటన చూసి వాళ్లు గిల్టీగా ఫీలవుతారని అంటోంది ఝాన్సీ

,  ,  ,  ,  ,