Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Apr-2016 15:02:34
facebook Twitter Googleplus
Photo

ప్రేమ కావాలి, లవ్లీ లాంటి రొమాంటిక్ హిట్స్ అందుకున్న ఆది ఇటీవల వచ్చిన గరం సినిమాతో ప్రేక్షకులని మెప్పించలేకపోయాడు. ప్రస్తుతం తను నటిస్తున్న సినిమా చుట్టాలబ్బాయి?. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ చివరి వారంలో విడుదల అవుతున్నది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ?చుట్టాలబ్బాయి? లో ఆది సరసన నమిత, యామిని కథానాయికలుగా నటిస్తున్నారు. ​ఇప్పుడు ఈ సినిమా కి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తున్నది.
​అదేమిటంటే ఈ చుట్టాలబ్బాయి సినిమాలో ప్రముఖ మళయాల యువనటుడు జాన్ కొక్కేన్ విలన్ గా నటిస్తున్నట్లు సమాచారం. ఈ పాత్రకు మొదట ప్రముఖ బాలీవుడ్ నటుడు ఉపేన్ పటేల్ ని ప్రతినాయకుడిగా అనుకున్నా చివరకు జాన్ కొక్కేన్ వైపు దర్శకనిర్మాతలు మొగ్గుచూపినట్లు సమాచారం. ఈ సినిమాలో పూర్తిగా రఫ్ గెటప్ తో పూర్తిగా గోదావరి యాసతో జాన్ కొక్కేన్ పాత్ర ఉంటుందని తెలిసింది. ల‌వ్ ఇన్ సింగ‌పూర్ అనే మ‌ల‌యాళ సినిమా ద్వారా న‌టుడుగా ప‌రిచ‌య‌మై కొద్ది కాలంలోనే మంచి పేరు సంపాదించుకున్న జాన్ కొక్కేన్ ప్ర‌స్తుతం ఎన్టీఆర్ న‌టిస్తున్న జ‌న‌తా గ్యారేజ్ సినిమాలో నటిస్తుండటం విశేషం.

,  ,  ,  ,  ,