Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Feb-2017 14:31:45
facebook Twitter Googleplus
Photo

వరుసగా మూడు హిట్లు కొట్టేసి మాంచి ఊపులోకి వచ్చాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. హ్యాట్రిక్ మూవీ జనతా గ్యారేజ్ చేస్తుండగానే వక్కంతం వంశీ దర్శకత్వంలో తర్వాతి సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు కానీ.. ఎందుకు ఆ కథ మీద గురి కుదరక పక్కన పెట్టేశాడు. దీంతో మూడు హిట్ల తర్వాత కూడా చాలా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. మధ్యలో అనేకానేక కథలు విని.. చివరికి బాబీ చెప్పి త్రిపాత్రాభినయ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు యంగ్ టైగర్. ఈ చిత్రం వారం కిందటే ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది. రెగ్యులర్ షూటింగ్ ఒకటి రెండు రోజుల్లో మొదలు కానుంది. ఐతే ఎన్టీఆర్ మాత్రం షూటింగుకి రావడానికి కొంచెం ఆలస్యమవుతోంది.

బాబీ సినిమాలో ఎన్టీఆర్ మేకప్ కోసం హాలీవుడ్ నిపుణుడు వాన్స్ హార్ట్ వెల్ పని చేయనున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ మెజర్మెంట్స్ అన్నీ తీసుకుని అమెరికాకు వెళ్లిన హార్ట్ వెల్.. ఇంకో వారంలో తిరిగి హైదరాబాద్ రాబోతున్నాడు. అతనొచ్చి తన లుక్.. మేకప్ అన్నీ ఫైనలైజ్ చేయగానే ఎన్టీఆర్ రెగ్యులర్ షూటింగుకి హాజరవుతాడు.

,  ,  ,  ,  ,  ,  ,