Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Aug-2016 17:43:39
facebook Twitter Googleplus
Photo

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఊపుమీదున్నాడు. టెంపర్.. నాన్నకు ప్రేమతో సినిమాలు అతడికి సంతోషాన్ని మిగిల్చాయి. ఇలాంటి టైంలోనే రెండు బ్లాక్ బస్టర్ హిట్లతో ఊపుమీదున్న కొరటాల శివతో సినిమా చేసే అవకాశం దక్కింది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ?జనతా గ్యారేజ్?కు సంబంధించి ప్రతి విషయం కూడా చాలా పాజిటివ్ గా కనిపిస్తోంది. మొదట్నుంచి ?జనతా గ్యారేజ్? మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మధ్య ట్రైలర్ చూశాక.. ఆడియో విన్నాక అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా అనుకున్నట్లుగానే సెప్టెంబరు 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ప్రస్తుతం ఐదు రోజుల పాటు నైట్ ఎఫెక్టులో ఓ పాట చిత్రీకరిస్తోంది గ్యారేజ్ టీం. ఆడియోలో 123 మైక్ టెస్టింగ్ అంటూ దేవిశ్రీ మార్కు ఐటెం సాంగ్ ఉంది కదా. ఆ పాటనే ఎన్టీఆర్-కాజల్ మీద చిత్రీకరిస్తున్నారు. హైదరాబాద్ లో భారీ సెట్టింగ్ వేసి ఈ పాట తీస్తున్నారు. శేఖర్ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేశాడీ పాటకు. ఇందులో ఎన్టీఆర్ డ్యాన్సులు మామూలుగా ఉండవంటున్నారు. ఈ పాట చిత్రీకరణతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. విడుదలకు నాలుగు రోజుల ముందే సెన్సార్ పూర్తి చేయబోతున్నారు.

ఇక ఎన్టీఆర్ కొత్త సినిమాకు సంబంధించిన అప్ డేట్ కూడా వచ్చేసింది. వక్కంతం వంశీ స్క్రిప్టు ఫైనలైజ్ అయిపోయిందట. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నటీనటుల ఎంపిక మీద.. టెక్నీషియన్స్ మీద దృష్టిపెట్టాడు వక్కంతం వంశీ. దర్శకుడిగా తన తొలి సినిమా విషయంలో అన్నీ పక్కాగా ఉండేలా చూసుకుంటున్నాడు వంశీ. ఈ సినిమా అక్టోబర్ లో ప్రారంభోత్సవం జరుపుకోనుంది. ఎన్టీఆర్ అన్నయ్య కళ్యాణ్ రామే ఈ చిత్రాన్ని నిర్మించబోతున్న సంగతి తెలిసిందే.

,  ,  ,