Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Dec-2016 14:41:27
facebook Twitter Googleplus
Photo

సాదారణంగా పెళ్లికాకముందు దుమ్మురేపిన హీరోయిన్స్ పెళ్లి అనంతరం సినిమాలకు చాలా వరకూ దూరమవుతుంటారు. అనంతరం చాలా గ్యాప్ తర్వాత లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లోనూ అదీకాకపోతే సీరియల్స్ లోనూ నటిస్తుంటారు. కానీ వారిలో నూటికో కోటికో ఒక్కరికి సెకండ్ ఇన్నింగ్స్ లోనూ హీరోయిన్ గా నటించే అవకాశం వస్తుంటుంది. ప్రస్తుతం ఇదే గోల్డెన్ ఛాన్స్ పట్టేసిందట జ్యోతిక.

హీరోయిన్ గా అవకాశాలు పుష్కలంగా ఉన్న దశలోనే హీరో సూర్యను వివాహం చేసుకుని సెటిల్ అయిపోయింది జ్యోతిక. అనంతరం భర్త - పిల్లలు - ఫ్యామిలీతో కాలం కడిపినప్పటికీ నటన విషయంలో సూర్య నుంచి ఆమెకు మంచి ప్రోత్సాహమే ఉంది. ఇందులో భాగంగానే ఆమె కొన్ని లేడీఓరియెంటెడ్ సినిమాలు కూడా నటించారు. అయితే తాజాగా హీరో విజయ్ సరసన ఆమెకు కథానాయికగా నటించే అవకాశం వచ్చిందని తెలుస్తుంది.

విజయేంద్ర ప్రసాద్ కథతో రూపొందనున్న విజయ్ 61 వ సినిమాలో గ్లామర్ కోసం వేరే హీరోయిన్లు ఉన్నప్పటికీ విజయ్ సరసన ఒక హీరోయిన్ గా జ్యోతిక కూడా నటిస్తుందని తెలుస్తోంది. ఇదే నిజమైతే... సుమారు 14 సంవత్సరాల అనంతరం ఈ కాంబినేషన్ రిపీటవుతున్నట్లు. కాగా గతంలో విజయ్ - జ్యోతిక కాంబినేషన్ లో "ఖుషీ" సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తమిళంలో సూపర్ డూపర్ హిట్ కావడం అనంతరం తెలుగులోనూ రీమేక్ అవ్వడం తెలిసిందే. ఏది ఏమైనా... సెకెండ్ ఇన్నింగ్స్ లో జ్యోతిక కు ఒక స్టార్ హీరో సరసన కథానాయకిగా అవకాశం రావడం అదృష్టమే. దాంతో ఆమె కెరీర్ ఏ స్థాయిల్లో ఊపందుకుంటుందనేది వేచి చూడాలి!

,  ,  ,  ,  ,