Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-May-2016 12:38:12
facebook Twitter Googleplus
Photo

రజనీ కాంత్ అభిమానులు ఎప్పుడెప్పుడు ?కబాలి? సినిమా వస్తుందా అని చూస్తోన్న ఎదురుచూపులు ఇంకొంత కాలం ఇలాగే కొనసాగేలా ఉన్నాయని సమాచారం. ఈమధ్యే విడుదలైన ట్రైలర్‌తో రెట్టించిన ఉత్సాహంతో సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులు జూలై 1వరకూ ఆగక తప్పేలా లేదు. రజనీ ఓ గ్యాంగ్‌స్టర్‌గా నటించిన ?కబాలి? టీజర్‌తోనే ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత సినిమాను జూన్ 3న ప్రేక్షకుల ముందుకు తెచ్చే ఆలోచన చేసినట్లు టీమ్ తెలిపినా, ప్రస్తుతానికి ఆ తేదీన సినిమా విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు.
తమిళంలో రియలిస్టిక్ సినిమాలతో దర్శకుడిగా తనదైన బ్రాండ్ సెట్ చేసుకున్న పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు జూలై 1 అయితే సరైన విడుదల తేదీ అని, రంజాన్ సెలవు దినాలు కూడా సినిమాకు కలిసివస్తాయని టీమ్ ఆలోచిస్తుందట. జూన్‌లో అయితే సినిమా విడుదలయ్యే అవకాశాలు చాలా తక్కువ అని వినిపిస్తోంది. కళైపులి థాను తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించిన ఈ సినిమాలో రాధికా ఆప్టే హీరోయిన్‌గా నటించారు. సినిమా జూలైకి షిఫ్ట్ అవ్వడంపై వస్తున్న కథనాలపై సినిమా యూనిట్ నుంచి త్వరలోనే ఓ అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది

,  ,  ,  ,  ,  ,