Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Jun-2016 17:04:31
facebook Twitter Googleplus
Photo

సూపర్ స్టార్ రజనీ కాంత్‌కు దేశవ్యాప్తంగా ఏ స్థాయి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తాజాగా ఆయన హీరోగా నటించిన ?కబాలి? సినిమా అయితే టీజర్ విడుదలప్పట్నుంచే సంచలనాలు నమోదు చేస్తూ వస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమా మళయాలంతో పాటు హిందీలోనూ డబ్ అవుతూ దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించేందుకు సిద్ధమవుతోంది. మొదట జూన్ నెలాఖర్లో విడుదలవుతుందనుకున్న ఈ సినిమా ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల జూలై 1కి వాయిదా పడింది.
ఇక జూలై 1న ఈ సినిమా థియేటర్లకు వచ్చేస్తోందని సంబరాలు చేసుకుంటోన్న అభిమానులను నిరాశపరిస్తూ తాజాగా నిర్మాత కళైపులి థాను టీమ్ జూలై 15న సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపింది. దీంతో సినిమా విడుదలకు ఇంకా రెండే వారాలు ఉందనుకున్న అభిమానులు ఇప్పుడు నెలరోజుల పాటు ఎదురుచూడక తప్పని పరిస్థితి ఎదురైంది. జూన్ 15 నుంచి తమిళనాడులోని ప్రధాన ప్రాంతాలకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ జరగనుందని, డిస్ట్రిబ్యూషన్ సంబంధిత పనుల వల్లే సినిమా వాయిదా పడిందని తెలుస్తోంది. రియలిస్టిక్ సినిమాలతో తనదైన బ్రాండ్ సృష్టించిన పా రంజిత్ తెరకెక్కించిన ఈ సినిమాలో రజనీ ఓ వయసైన గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు.

,  ,  ,  ,  ,  ,