Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Apr-2016 14:14:09
facebook Twitter Googleplus
Photo

చిరునవ్వు, పిడికిట ఇమిడే నడుము, యువరాణిని పోలిన హుందాతనం? అన్నీ కలిసి కాజల్‌ను టాలీవుడ్‌ క్వీన్‌ని చేశాయి. తెలుగులోకి అడుగుపెట్టి దాదాపు దశాబ్దం గడుస్తున్నా కాజల్‌ దూకుడు ఏమాత్రం తగ్గలేదు. అలనాటి లక్ష్మీకల్యాణం నుంచి రాబోయే బ్రహ్మోత్సవం వరకూ గ్లామర్‌ విషయంలో తోటి హీరోయిన్లకు ఎప్పటికప్పుడు సవాలు విసురుతూ ఎవర్‌గ్రీన్‌ హీరోయిన్‌గా వెలిగిపోతున్న కాజల్‌ ఏడుపు సన్నివేశాల్లో బాగా కష్టపడుతుంది అంటారు నిజమేనా..అని అడిగినప్పుడు
?మొదట్లో ఇబ్బంది పడిన మాట నిజమే! ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. సన్నివేశం విన గానే సహజంగానే ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. తెరమీద నా ఏడుపు చూసి మావాళ్ళు నిజంగా చాలా బాగా చేశావు అంటూ మెచ్చు కుంటూ ఉంటారు. నిజం చెప్పా లంటే డ్యాన్స్‌కే నేను ఎక్కువగా కష్టపడుతుంటాను. బాగా డ్యాన్స్‌ చేసే హీరోల పక్కన చేయాలంటే ఇప్పటికీ నాకు వణుకే!

,  ,  ,  ,  ,  ,