Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

31-May-2016 11:33:01
facebook Twitter Googleplus
Photo

క్రియేటివ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన కృష్ణ వంశీ.. తన కొత్త ప్రాజెక్టుకు సంబంధించి కాస్టింగ్ ఫైనలైజ్ చేసుకుంటున్నాడు. రామ్ చరణ్ తేజ్ తో గోవిందుడు అందరివాడేలే చిత్రం తీసి.. తనలో స్టామినా ఇంకా ఇంకిపోలేదని ప్రూవ్ చేసుకున్న కృష్ణవంశీ.. బాలయ్యతో 100వ సినిమాకి ట్రై చేశాడు కానీ వర్కవుట్ కాలేదు. మధ్యలో రుద్రాక్ష అనే ప్రాజెక్టు పట్టాలపైకి ఎక్కబోయి ఆగిపోయింది. ఇప్పుడు నక్షత్రం అనే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడు కృష్ణవంశీ.

సందీప్ కిషన్ లీడ్ రోల్ లో చేయబోతున్న నక్షత్రం చిత్రానికి ఇంకా హీరోయిన్ ఫైనల్ కావాల్సి ఉంది. రెజీనా కసాండ్రా - నందితా రాజ్ లతో చర్చలు జరుగుతుండగా.. ఈ మూవీకి భారీ కాస్టింగ్ తో ఆకర్షణ తీసుకురానున్నాడు ఈ దర్శకుడు. కాజల్ అగర్వాల్ ని టాలీవుడ్ కి చందమామగా చేసిన ఈయన.. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్ గా తీసుకున్నాడు. ఇప్పుడు కాజల్ ను నక్షత్రంలో కూడా నటింపచేయనున్నాడని తెలుస్తోంది.

అయితే కాజల్ చేయబోయే పాత్ర హీరోయిన్ కాదు. కన్నడ సూపర్ స్టార్ ఈగ సుదీప్ కు జోడీగా నటించనుందట చందమామ. నక్షత్రంలో ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం సుదీప్ తో చర్చలు జరుపుతోంది యూనిట్. సుదీప్ - కాజల్ లు కథకు అవసరమయ్యే ఇంపార్టెంట్ రోల్స్ లో కనిపించనున్నారని తెలుస్తోంది

,  ,  ,  ,