Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Jul-2017 14:19:40
facebook Twitter Googleplus
Photo

ఆవారా.. నా పేరు శివ లాంటి సినిమాలతో తెలుగులో మాంచి ఫాలోయింగ్ సంపాదించిన తమిళ హీరో కార్తి.. తర్వాత వరుస ఫ్లాపులతో వెనుకబడిపోయాడు. తెలుగులో అతడి ఫాలోయింగ్ క్రమక్రమంగా పడిపోయి అతడి కొత్త సినిమాలు అనువాదం కాని పరిస్థితి వచ్చేసింది. ఐతే గత ఏడాది ఊపిరితో తెలుగు ప్రేక్షకుల మనసు దోచాడు కార్తి. కాష్మోరాకు ఇక్కడ మంచి ఓపెనింగ్సే వచ్చాయి. ఈ ఏడాది చెలియాతో చేదు అనుభవాన్ని ఎదుర్కొన్న కార్తి.. ఇప్పుడు ఖాకి అంటూ కొత్త సినిమాతో పలకరించబోతున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ శుక్రవారమే విడుదలైంది. పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.

ఖాకికి సంబంధించి కొన్ని ఆసక్తికర విశేషాలున్నాయి. రెండు దశాబ్దాలుగా సంగీత రంగంలో తిరుగులేని హవా సాగిస్తున్న ఆదిత్య మ్యూజిక్ సంస్థ ఈ చిత్రంతోనే నిర్మాణంలోకి అడుగుపెడుతోంది. ఆడియో సీడీల మార్కెట్ పూర్తిగా దెబ్బ తినేసిన నేపథ్యంలో ఆ సంస్థ ప్రొడక్షన్ వైపు చూస్తున్నట్లుంది. ఇక ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తుండటం విశేషం. ఆమెకిదే తొలి తమిళ సినిమా కావడం గమనార్హం.

ఈ చిత్ర దర్శకుడు హెచ్.వినోద్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అఆ సినిమాటోగ్రాఫర్ నటరాజ్ సుబ్రమణ్యం హీరోగా అతను శతురంగ వేట్టై అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. గత ఏడాది లైఫ్ స్టైల్ బిల్డింగ్ యజమానిని ఓ బాబా రైస్ పుల్లింగ్ పేరుతో బురిడీ కొట్టించడం గుర్తుండే ఉంటుంది. ఇలాంటి మోసాల నేపథ్యంలో వాస్తవ సంఘటనల ఆధారంగా శతురంగ వేట్టై సినిమాను రూపొందించి సూపర్ హిట్ కొట్టాడు వినోద్. ఇప్పుడు కార్తి హీరోగా కూడా అతను వాస్తవ ఘటనల ఆధారంగా ‘ఖాకి’ సినిమా తీస్తున్నాడు.

,  ,  ,  ,  ,