Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-May-2016 12:14:58
facebook Twitter Googleplus
Photo

తమిళ స్టార్ హీరో కార్తీకి తెలుగు సినీ పరిశ్రమలోనూ ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సూర్య తమ్ముడిగా పరిచయమైన కార్తీ, అనతికాలంలోనే తనదైన గుర్తింపు సంపాదించుకొని తమిళంలో స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకున్నారు. ఇక డబ్బింగ్ సినిమాలతో తెలుగు సినీ అభిమానులకు కూడా కార్తీ మనవాడే అన్నంత దగ్గరపోయిన కార్తీ, నేడు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఇక ఈ సందర్భంగా అభిమానులను ఆశ్చర్యపరుస్తూ కార్తీ, ట్విట్టర్‌కి వచ్చేశారు.
ట్విట్టర్‌లో @Karthi_Offl హ్యాండిల్‌తో ఎంట్రీ ఇచ్చిన కార్తీ అభిమానులను ఉద్దేశించి థ్యాంక్స్ తెలుపుతూ ఓ ట్వీట్ చేశారు. ఈమధ్యే తెలుగులో ఊపిరి సినిమాతో సూపర్ హిట్ కొట్టి, తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన కార్తీ, ప్రస్తుతం తమిళంలో లాష్మోరా అనే సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఇక కార్తీ ట్విట్టర్‌కు రావడం పట్ల తమ ఆనందాన్ని తెలుపుతూ అభిమానులు ట్వీట్స్‌తో స్వాగతం పలికారు.

,  ,  ,  ,  ,  ,