Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-May-2017 14:47:48
facebook Twitter Googleplus
Photo

అసలే సాయిధరమ్ తేజ్ కెరీర్ ఇప్పుడేమంత బాగా లేదు. తిక్క.. విన్నర్ లాంటి ఫ్లాపులతో కుర్రాడు బాగా దెబ్బ తిన్నాడు. ఇప్పుడు అతడికి హిట్టు చాలా అవసరం. ఇలాంటి టైంలో ఎవరైనా హిట్ డైరెక్టర్ల కోసం ట్రై చేస్తారు. కానీ తేజు మాత్రం దర్శకుల ట్రాక్ రికార్డు చూడకుండా సినిమాలు ఒప్పుకుంటుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. వాంటెడ్ లాంటి అట్టర్ ఫ్లాప్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన బి.వి.ఎస్.రవితో జవాన్ చేస్తున్న తేజు.. దీని తర్వాత మరో ఫ్లాప్ డైరెక్టర్ తో జట్టు కట్టడానికి రెడీ అయిపోయాడు. తొలి ప్రేమ ఫేమ్ కరుణాకరన్ తో తేజు ఓ సినిమా చేయబోతున్నాడట. కెరీర్ ఆరంభం నుంచి మాస్ టచ్ ఉన్న సినిమాలే చేస్తున్న తేజు.. తొలిసారిగా కరుణాకరన్ దర్శకత్వంలో ఓ ప్రేమకథ చేయబోతున్నాడట.

కరుణాకర్ గురించి చెప్పాల్సి వస్తే ఇప్పటికే తొలి ప్రేమ నే ప్రస్తావించాల్సి వస్తుండటమే.. అతడి ట్రాక్ రికార్డు ఎలాంటిదో చెప్పేస్తుంది. తొలి ప్రేమ తర్వాత ఆ స్థాయిలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా చేయలేకపోయాడు కరుణాకరన్. వాసు.. ఉల్లాసంగా ఉత్సాహంగా లాంటి సినిమాలు పర్వాలేదనిపించాయి కానీ.. మిగతావన్నీ ఫ్లాపులే. చివరగా అతను తీసిన చిన్నదాన నీకోసం కూడా ఆడలేదు. దీని తర్వాత రామ్ హీరోగా ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకున్న కరుణాకర్.. ఈ సినిమాను పట్టాలెక్కించలేకపోయాడు. చివరికి తేజుకు ఓ ప్రేమకథ చెప్పి ఒప్పించాడు.

,  ,  ,  ,  ,