Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Feb-2017 15:28:16
facebook Twitter Googleplus
Photo

పవన్ కళ్యాణ్ నటిస్తున్న కాటమరాయుడు చిత్రం షూటింగ్ ఆఖరి దశలో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్లో క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫిబ్రవరి 6 నుండి వైజాగ్లో కొత్త షెడ్యూల్ ప్రారంభించనుంది. ఆ తర్వాత పాటలు షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లనుంది. మొదట మార్చి నెలాఖరులో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. కానీ కొత్తగా వినిపిస్తున్న వార్తల ప్రకారం సినిమా మార్చి నెలాఖరు కన్నా కాస్త ముందే వచ్చేస్తుందట.
అనుకున్న తేదీ కంటే షూటింగ్ త్వరగా పూర్తి కావోస్తుండటంతో అభిమానులను వెయిట్ చేయించకుండా ముందుగానే సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారట యూనిట్. ఇప్పటికే టీజర్ చాలా ఆలస్యమవడంతో కాస్త నిరుత్సాహానికి గురైన ఫ్యాన్స్ ఈ వార్త బయటకు రావడంతో ఊరట చెందారు. ఏదిఏమైనా ముందస్తు వాయిదాపై అధికారిక సమాచారం బయటకొచ్చే వరకు ఓపికపట్టాల్సిందే. శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డాలి డైరెక్ట్ చేస్తుండగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

,  ,  ,  ,  ,