Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Feb-2017 10:31:15
facebook Twitter Googleplus
Photo

పవన్ కళ్యాణ్ పవరేంటో మరోసారి అందరికీ తెలిసొచ్చింది. మొన్నటిదాకా కాటమరాయుడు ను జనాలంతా లైట్ తీసుకున్నారు కానీ.. ఇప్పుడు ఈ సినిమానే హాట్ టాపిక్ అయిపోయింది. నిన్న పెద్దగా అంచనాల్లేకుండా రిలీజైన కాటమరాయుడు టీజర్ యూట్యూబ్ ను షేక్ చేసేసింది. టాలీవుడ్ టీజర్ రికార్డులన్నింటినీ తిరగరాసింది. కేవలం 2 గంటల్లోనే మిలియన్ వ్యూస్.. ఐదున్నర గంటల్లోనే 2 మిలియన్ వ్యూస్ సాధించిన ఈ టీజర్.. 24 గంటల్లోనే 37 లక్షల వ్యూస్ తో ఔరా అనిపించింది. ఇప్పటిదాకా ఏ తెలుగు టీజర్ కూడా 24 గంటల్లో ఇన్ని వ్యూస్ తెచ్చుకోలేదు. ఈ టీజర్ కు ఒక్క రోజులో 1.4 లక్షల లైక్స్ కూడా వచ్చాయి. ఇది కూడా రికార్డే.

టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేసిన నేపథ్యంలో ?కాటమరాయుడు? టీం రిలీజ్ చేసిన లేటెస్ట్ పోస్టర్ కూడా కెవ్వు కేక అనిపించేదే. పంచెకట్టులో అదిరిపోయే లుక్ తో పవన్ నా పవర్ ఇదీ అని చెబుతున్నట్లుగా ఈ పోస్టర్ డిజైన్ చేశారు. ఇందులోనే టాలీవుడ్లో అత్యంత వేగంగా 1 మిలియన్ వ్యూస్ తెచ్చుకున్న టీజర్ ఇదేనని.. 24 గంటల్లో 37 లక్షల వ్యూస్ వచ్చాయని పేర్కొన్నారు. రేపటికల్లా ?కాటమరాయుడు? టీజర్ 50 లక్షల వ్యూస్ మార్కును కూడా అందుకునే అవకాశాలున్నాయి. తెలుగులో ?ఖైదీ నెంబబర్ 150? టీజర్ 76 లక్షల వ్యూస్ తో అగ్రస్థానంలో ఉంది. ఆ రికార్డును ?కాటమరాయుడు? టీజర్ బద్దలు కొట్టే అవకాశాలున్నాయి.

,  ,  ,  ,  ,