Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Oct-2017 12:21:16
facebook Twitter Googleplus
Photo

ఈ మలయాళ భామ తమిళంలో ఇప్పటికే స్టార్ హీరోయిన్. విజయ్ లాంటి స్టార్ హీరోతో జత కట్టింది. తెలుగులో ఆల్రెడీ నేను శైలజ. నేను లోకల్ లాంటి సూపర్ హిట్లు అందుకుంది. కానీ అన్ని సినిమాల్లోనూ ఆమె పద్ధతిగానే కనిపించింది. గ్లామర్ క్యారెక్టర్లు చేయలేదు. అందాల ప్రదర్శన చేయలేదు.

తాను ఉద్దేశపూర్వకంగానే అలాంటి క్యారెక్టర్లు అవాయిడ్ చేస్తున్నట్లు చెప్పింది కీర్తి. భవిష్యత్తులో కూడా తాను గ్లామర్ పాత్రలు చేయనని ఆమె ఖరాఖండిగా చెప్పేయడం విశేషం. నాకు గ్లామర్ పాత్రలు నప్పవు. నేను అలాంటి పాత్రలు చేయను. ఇది ఇప్పుడంటున్న మాట కాదు. ఐదేళ్ల తర్వాత వచ్చి నన్ను అడిగినా ఇదే మాట చెబుతాను. అందాల ప్రదర్శన చేయనంతే అని తేల్చి చెప్పింది కీర్తి.

ఇక మహానటి లాంటి ప్రత్యేకమైన సినిమాలో సావిత్రి పాత్రకు తనను ఎంచుకోవడం గురించి స్పందిస్తూ.. నేను తమిళంలో తొడరి సినిమా చేసినపుడు నన్ను పిలిచి మహానటి లో నటిస్తావా అని అడిగారు. సావిత్రి పాత్ర అనగానే నాకు భయమేసింది. నేను చేయగలనా అనిపించింది. ఐతే నేను ఆ పాత్రకు పక్కాగా సూటవుతానని ఆ చిత్ర నిర్మాత చెప్పారు. తర్వాత మేకప్ టెస్ట్ చేసి నన్ను ఈ పాత్రకు ఖాయం చేశారు. ఈ సినిమా నా కెరీర్లో చాలా ప్రత్యేకమవుతుంది.

,  ,  ,  ,  ,