Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Apr-2016 19:00:13
facebook Twitter Googleplus
Photo

మలయాళీ భామ కీర్తి సురేష్‌. రామ్‌ హీరోగా తెరకెక్కిన నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అందరినీ తన నటనతో మెప్పించినా ఎందుకో ఆ తర్వాత ఎన్నో మంచి మంచి ఆఫర్లు వచ్చినట్లే వచ్చి చేజారిపోయాయి. ఇప్పుడు తాజాగా కోలీవుడ్‌, ఇటు టాలీవుడ్‌లలో మళ్లీ సినిమాలు చేజిక్కించుకుని రీఎంట్రీకి రెడీ అవుతున్న కీర్తి సురేష్‌తో? పుట్టింది, పెరిగింది చెన్నైలోనే. నటన అంటే అవగాహన ఉన్న కుటుంబం. అమ్మ, నాన్న ఇద్దరూ సినీ ఇండస్ట్రీకి చెందిన వారే. అమ్మ మేనక, నటి. నాన్న సురేష్‌ కుమార్‌, ప్రొడ్యూసర్‌.
ఐదో తరగతి వరకూ నా చదువు చెన్నైలోనే
ఐదో తరగతి వరకూ నా చదువు చెన్నైలోనే . కేరళ వెళ్ళాక 2000 సంవత్సరంలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించడం మొదలెట్టాను. అదికూడా మా నాన్న గారు నిర్మించిన చిత్రాల్లోనే చేశాను. అప్పట్లో అసలు నాకు నటన అంటే ఏంటో కూడా తెలిసేది కాదు. అందుకని అప్పుడే నాకెరీర్‌ స్టార్ట్‌ అయిందని చెప్పలేను.
నేను హీరోయినగా పరిచయమైంది గీతాంజలి సినిమాతోనే
తొమ్మిదో తరగతిలో ఉన్నప్పటి నుంచే సినిమా ఆఫర్లు వచ్చేవి. నాక్కూడా సినిమాలు చేయడం అంటే ఇష్టంగానే ఉండేది. సినిమాల్లోకి రావాలని మా పేరెంట్స్‌తో చెప్పినప్పుడు వాళ్లేమీ అభ్యంతరం చెప్పలేదుగానీ చదువు తర్వాతే సినిమా అని చెప్పారు. అందుకే ఇంటర్మీడియట్‌ పూర్తయ్యే వరకూ ఆగి తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్‌ కోర్స్‌ చేస్తూ సినిమాలు చేయడం మొదలు పెట్టాను. మొదటిసారి నేను హీరోయినగా పరిచయమైంది గీతాంజలి సినిమాతోనే.
ఫైనల్‌ సెలక్షన్ మాత్రం నా ఇష్టమే
మా అమ్మానాన్నా నాతో పాటే సినిమా కథలు వింటారు. ఏది బాగుందో బాగాలేదో చెప్తారు. ఫైనల్‌ సెలక్షన్ మాత్రం నా ఇష్టమే. కేవలం హీరోయిన్‌గా మాత్రమే ఉండాలనుకోవట్లేదు. కథ, నటన, డైరెక్షన్ ఇలా సినిమాకు సంబంధించిన ప్రతీ పని నాకు చాలా ఇష్టం. దేన్నయినా చేయడానికి రెడీగా ఉండాలనుకుంటాను.
భవిష్యత్తు గురించి ఆలోచించను
భవిష్యత్తు గురించి ఆలోచించను. ఇప్పుడున్న పరిస్థితుల గురించి మాత్రమే ఆలోచిస్తాను. నాకు వచ్చిన క్యారెక్టర్‌ పర్‌ఫెక్ట్‌గా చేయడానికి ప్రయత్ని స్తాను. అలాగే విభిన్నమైన పాత్రలలో నటించడం ఇష్టం. క్వీన్ సినిమాలో కంగనా, మలయాళచిత్రం ?మర్యన? లో పార్వతి లాంటి పాత్రల్లో నటించాలనేది నా కోరిక. ఫలానా డైరెక్టర్‌తోనే చేయాలనే ఉద్దేశాలు లేవు. కథ బాగుంటే ఏ దర్శకుడి చిత్రంలోనైనా చేయడానికి సిద్ధం.
గ్లామర్‌
సినిమా అన్నప్పుడు అన్ని అంశాలు అందులో ఉండాలి. అయితే కేవలం గ్లామర్‌ ప్రధానాంశంగా ఉన్న పాత్రలు చేయడానికి నేను ఇష్టపడను. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలంటే నాకిష్టం.
ఫ్యూచర్‌ ప్రాజెక్టులు
ఇప్పుడు టాలీవుడ్‌లోనూ, కోలీవుడ్‌లోనూ వివిధ రకాల ప్రాజెక్ట్‌లమీద సైన్ చేశాను. తాజాగా సిద్దార్థ్‌తో నటించడానికి సైన్‌ చేశాను. హీరో విజయ్‌ 60వ సినిమాలో కూడా చేయబోతున్నాను. ఇంకా రెండు మూడు ప్రాజెక్టులు పరిశీలనలో ఉన్నాయి.

,  ,  ,  ,  ,  ,