Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Sep-2016 12:03:40
facebook Twitter Googleplus
Photo

2016 మలయాళ కుట్టి కీర్తి సురేష్ కి బాగా కలిసొచ్చింది. ఈయర్ స్టార్టింగే నేను.. శైలజ అంటూ తెలుగులోకి ఎంట్రీ ఇస్తూనే సూపర్ హిట్ ని కొట్టిన కీర్తి.. ఆ వెంటనే పొంగల్ కి రజనీ మురుగన్ అంటూ తమిళ్ లో బ్లాక్ బస్టర్ ని అకౌంట్ లో వేసుకొంది. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో మాంచి ఆఫర్స్ పట్టేసి బిజీ హీరోయిన్ అయిపోయిన కీర్తి.. ఇప్పుడు తొడరితో మరో విజయం తన ఖాతాలో వేసుకునేలాగే కనిపిస్తోంది.

తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తొడరిలో టచ్ అప్ గర్ల్ సరోజ కేరెక్టర్ లో అమాయకంగా కనిపిస్తూనే యాక్టింగ్ ఇరగదీసేసిందనే టాక్ వినిపిస్తోంది. తింగరబుచ్చి టైప్ లో కీర్తి చేసిన కామెడీకి క్రిటిక్స్.. ఆడియెన్స్ నుంచి మంచి మార్కులు పడుతున్నాయ్. ఇదే మూవీ రైల్ పేరుతో తెలుగులో కూడా రిలీజైంది. ధనుష్ లాంటి స్టార్ హీరో పక్కన నటిస్తూ.. జనాల కంటిలో పడటమే ఎక్కువ. అలాంటిది ఏకంగా యాక్టింగ్ సూపరంటూ ప్రశంసలు అందుకుంటుందంటే కీర్తికి మంచి ఫ్యూచర్ ఉందనే అనుకోవాలి.

ఇక దసరాకి రెమో రాబోతుంది. ఆ మూవీతో శివకార్తీకేయన్ తో మరోసారి జత కట్టింది. ఇప్పటికే శివ-కీర్తి రజనీమురుగన్ తో హిట్ కొట్టి ఉండటం.. ఇటు రెమో ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డ్ లు క్రియేట్ చేస్తుండటంతో ఆ మూవీ మీద హైప్ పెరిగిపోయింది. ఇక రెమో కూడా హిట్ అయితే 2016 కీర్తి కెరీర్ లో స్పెషల్ అయిపోతుంది.

,  ,  ,  ,  ,