Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Jan-2017 11:11:42
facebook Twitter Googleplus
Photo

మహానటి సావిత్రిపై బయోపిక్.. టాలీవుడ్ చాలా నెలలుగా ఈ ప్రాజెక్టుపై వర్క్ జరుగుతోంది. స్క్రిప్ట్ సిద్ధం చేసుకోవడం లాంటి పనులన్నీ పూర్తి చేసుకున్నట్లు గతంలోనే చెప్పేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ పాత్రకు ఎవరు న్యాయం చేయగలరన్నదే అసలు ప్రశ్నగా మిగిలిపోతోంది. నిత్యామీనన్ ను సంప్రదించారని.. విద్యాబాలన్ ఖాయమైందని.. సమంత అంగీకరించిందని.. ఇలా రకరకాల రూమర్స్ వచ్చాయి.

ఇప్పడీ లిస్ట్ లోకి మరోపేరు వచ్చి చేరింది. యంగ్ హీరోయిన్ కీర్తి సురేష్ ఈ పాత్రలో ఒదిగిపోతుందని దర్శకుడు భావిస్తున్నాడని.. ఆమెను ఆ పాత్రలోకి తీసుకునేందుకు సిద్ధమయ్యాయని అంటున్నారు. ఇప్పటికే కీర్తి సురేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో పలువురు ప్రధాన పాత్రలకు నటులను ఫిక్స్ చేయాల్సి ఉంటుంది.

ఎన్టీఆర్.. ఎఎన్నార్.. ఎస్వీఆర్.. గుమ్మడి.. జెమినీ గణేశన్ లాంటి పాత్రలు ఆమె జీవితంలో కీలక పాత్రలుగా ఉంటాయి. ఈ పాత్రలకు వీలైనంతవరకూ ఆయా నటుల వారసులను ఎంపిక చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. అయితే సావిత్రిగా నటించేందుకు తెలుగు అమ్మాయిలు మాత్రం దొరక్కపోవడమే ఆశ్చర్యకరం.

,  ,  ,  ,  ,