Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Nov-2016 12:23:05
facebook Twitter Googleplus
Photo

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం ఖైధీ నెం 150 వేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకునే పనిలో ఉంది. తాజాగా యూరప్ లో చిరు, కాజల్ పై పాటల చిత్రీకరణ పూర్తి చేసుకున్న యూనిట్ హైదరాబాద్ తిరిగొచ్చిన వెంటనే కొత్త షెడ్యూల్ ప్రారంభించనుంది. ఈ షెడ్యూల్ లో చిరంజీవిపై కీలకమైన కోర్ట్ సీన్ ఒకటి షూట్ చేస్తారట. యూరప్ ట్రిప్ కి ముందే క్లైమాక్స్ సన్నివేశాల్ని ముగించేసిన వినాయక్ ఈ ఈ కోర్ట్ సన్నివేశాన్ని ఎలాంటి హడావుడి లేకుండా చిత్రీకరించడానికి చివర్లో ప్లాన్ చేశాడట.
సోషల్ మెసేజ్ ఉన్న సినిమా కావడంతో ఈ కోర్ట్ సీన్ సినిమా మొత్తానికి హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు. సహజంగానే సినిమాకి కీలకమైన సన్నివేశాలకి నూటికి నూరు శాతం న్యాయం చేసే చిరంజీవి ఈ కోర్ట్ సీన్ ను కూడా అద్భుతంగా చేస్తారని బేర్ చెప్పనక్కర్లేదు. ఈ షెడ్యూల్ కూడా పూర్తవగానే టీమ్ పూర్తిగా ప్రమోషన్ల మీదే దృష్టి పెట్టనుంది. ఇకపోతే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాతో చిరంజీవి సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తారని మెగా అభిమానులంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,