మెగాస్టార్ కం బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150.. ఓవర్సీస్ లో భారీ బిజినెస్ చేసిన సంగతి ఇప్పటికే చెప్పేసుకున్నాం. ఇప్పటికే హోల్ సేల్ గా ఓసారి డిస్ట్రిబ్యూటర్ చేతులు మారింది కూడా. ఇప్పుడు అక్కడి లోకల్ బయ్యర్ల నుంచి డిస్ట్రిబ్యూటర్లకు వస్తున్న ఆఫర్స్ చూసి ఇండస్ట్రీ వర్గాలకు మైండ్ బ్లాంక్ అయిపోతోంది.
ఓవర్సీస్ రైట్స్ ద్వారా ఖైదీ నంబర్ 150కి 10 కోట్ల రూపాయల మొత్తం దక్కింది. టెక్సాస్ ఏరియా నుంచి 2 లక్షల డాలర్లు.. బే ఏరియా నుంచి 1.7 లక్షల డాలర్లు డిస్ట్రిబ్యూటర్లకు ఆఫర్స్ వస్తున్నాయి. ఈ రేంజ్ లో మిగిలిన ఏరియాలను కూడా రిలీజ్ కంటే ముందే అమ్మేసినా.. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ కి 20-30 శాతం లాభాలు కనీసం మిగులుతాయని అంచనా వేస్తున్నారు. చిరంజీవి రీ ఎంట్రీ పై ఉన్న అంచనాలు.. తాజాగా రిలీజ్ అయిన టీజర్.. ఆడియో సాంగ్స్.. మూవీపై విపరీతమైన హైప్ పెంచేస్తున్నాయి.
ఇప్పటివరకూ జరిగిన బిజినెస్ ప్రకారం ఓవర్సీస్ లో ఖైదీ నంబర్ 150 చిత్రానికి 1.8 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధిస్తేనే బ్రేక్ ఈవెన్ సాధ్యమవుతుంది. కానీ సంక్రాంతి ఇక్కడ సినిమాలకు మంచి సీజన్ అక్కడ మాత్రం వింటర్ కావడంతో.. సహజంగా వసూళ్లు మందగిస్తాయి. ఇలాంటి టైంలో దాదాపు 2మిలియన్ డాలర్లు వసూళ్లు సాధించడం.. చిరంజీవి పెద్ద మ్యాటరేం కాదని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.