Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Jan-2017 12:23:06
facebook Twitter Googleplus
Photo

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రంగా ఖైదీ నంబర్ 150 ఈ సంక్రాంతికి సందడి చేయనున్న సంగతి తెలిసిందే. జనవరి 11న విడుదల కానున్న ఈ చిత్రంపై ఇప్పటికే ఫుల్ హైప్ నెలకొంది. మరోవైపు ప్రీ రిలీజ్ ఫంక్షన్ విషయంలో కూడా కాస్త కన్ఫ్యూజన్ నెలకొన్నా.. చివరకు స్పాట్ ఫైనల్ అయింది.

చినకాకాని సమీపంలోని హాయ్ ల్యాండ్ లో మెగాస్టార్ మూవీ ఖైదీ నంబర్ 150 ప్రీరిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా చేయబోతున్నారు. ఈనెల 7న జరగనున్న ఈ మెగా వేడుక కోసం మెగాఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఇలా హాయ్ ల్యాండ్ లో జరపాలని కేవలం 5 రోజుల ముందే ఫిక్స్ కావడంతో.. ఏర్పాట్లన్నీ చకచకా జరిగిపోతున్నాయి. మొదటగా స్టేజ్ సెటింగ్ తో స్టార్ట్ చేసి.. మిగిలిన బ్యారికేడ్ ఏర్పాట్లు.. పార్కింగ్ కు వసతులు లాంటివాటిపై చకచకా పనులు పూర్తి చేస్తున్నారు.

చాలా ఛానళ్లు ఇప్పటికే ఖైదీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనున్న ప్రాంతానికి వచ్చి.. ఖైదీ ఫంక్షన్ ఇక్కడే అంటూ.. వీడియోలు తీసుకుని ప్రసారం చేస్తున్నాయి. చిరంజీవి కొత్త మూవీకి సంబంధించిన ప్రతీ అప్ డేట్ మీడియాలో విపరీతంగా హల్ చల్ చేస్తుండడం.. టీఆర్పీలు విపరీతంగా వస్తుండడంతో.. ఏ చిన్న సందర్భాన్ని కూడా మీడియా వదిలిపెట్టట్లేదు.

,  ,  ,  ,  ,  ,