Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Nov-2016 12:41:27
facebook Twitter Googleplus
Photo

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఖైధీ నెం 150 షూటింగ్ ఆఖరి దశలో ఉంది. ప్రస్తుతం యూరప్ దేశాలైన డుబ్రోవ్నిక్ లో ప్రస్తుతం చిరంజీవి, కాజల్ ల పై ఒక సాంగ్ షూట్ జరుగుతోంది. దీనికి సంబందించిన వర్కింగ్ స్టిల్స్ కూడా బయటికొచ్చాయి. వాటిలో చిరంజీవి చాలా స్లిమ్ గా, హుషారుగా కనిపిస్తున్నారు. మొదట కొందరు చిరు, కాజల్ ల జోడి పై అనుమానాలు వ్యక్తం చేశారు. వయసు తేడా ఉండటంతో వారి మధ్య కెమిస్ట్రీ కుదరదని అన్నారు. కానీ వర్కింగ్ స్టిల్స్ చూస్తే అలాంటిదేమీ లేదని, వారి జోడీ పర్ఫెక్ట్ గా కుదిరిపోయిందని అనిపిస్తోంది.
ముఖ్యంగా చిరంజీవి ఫిజిక్, డ్రెస్సింగ్ స్టైల్ అన్నీ పూర్తిగా మార్చేశాడు. చిరు కుమార్తె ప్రత్యేకంగా డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ లో చిరు చాలా యంగ్ గా కనిపిస్తున్నారు. ఆ లుక్ లో ఆయన్ను చూసిన అభిమానులు కూడా ఆనందంతో పొంగిపోతున్నారు. కాజల్ కూడా చిరంజీవిగారితో కలిసి పనిచేయడం, డాన్స్ చేయడం చాలా ఆనందంగా ఉందని మీడియాతో అన్నారు. మొత్తానికి చిరు సినిమాలోకి రీ ఎంట్రీ ఇచ్చి కొత్త ఉత్సాహంతో స్టెప్పులు అద్దరగొడుతున్నారన్నమాట. దాదాపు 9 ఏళ్ల తరువాత చిరు రీ ఎంట్రీ ఇస్తుండటంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. వినాయక్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం జనవరి సంక్రాంతికి రిలీజ్ కానుంది.

,  ,  ,  ,  ,  ,