Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Aug-2015 14:08:59
facebook Twitter Googleplus
Photo

రామ్ గోపాల్ వర్మ తీస్తున్న లేటెస్ట్ మూవీ కిల్లింగ్ వీరప్పన్. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ పై ఈ చిత్రాన్ని తీస్తున్నాడు వర్మ. టైటిల్ రోల్ లో సందీప్ భరద్వాజ్ నటిస్తున్న ఈ మూవీలో... కన్నడ హాట్ హాట్ బిజీ స్టార్ పరుల్ యాదవ్ కీలక పాత్ర పోషిస్తోంది.

బయోపిక్ లో తీసేటప్పుడు కూడా మనోళ్లకు ఓ అలవాటుంది. సినిమాటిక్ గా ఉండడం కోసం కొన్ని కేరక్టర్స్ ని సృష్టించేస్తుంటారు. కానీ వర్మ స్టయిలే వేరని కిల్లింగ్ వీరప్పన్ లో తాను.. ఓ రియల్ కేరక్టర్ పోషిస్తున్నాని చెబ్తోంది పారుల్ నిజజీవితంలో ఇప్పటికీ బతికే ఉన్న ఓ పాత్రను పోషించేందుకు.. తాను చాలా స్పెషల్ కేర్ తీసుకుంటున్నానని కాస్ట్యూమ్స్ ను కూడా రోడ్లపైనే కొనుగోలు చేస్తున్నానని చెప్పింది పారుల్.

సందీప్ భరద్వాజ్ గెటప్ సూపర్ గా కుదిరిందట ఈ సినిమాకి. ఒకవేళ బెంగళూరు రోడ్ల పై అదే గెటప్ సందీప్ నడిస్తే.. వీరప్పన్ దెయ్యంగా మారాడని బెంగళూరు జనాలు భయపడిపోయేంత ఒరిజినల్ గా ఉందని అంటోంది పారుల్. అన్నట్లు త్వరలో రిలీజ్ కానున్న ఉపేంద్ర 2 లోనూ... ఈ భామ ఓ మాంచి కేరక్టర్ చేసింది. తెలుగులో అవకాశాలు వస్తున్నాయని మంచి కేరక్టర్ వస్తే చేసేందుకు సిద్ధమేనని చెప్పింది పారుల్.

,  ,  ,