Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Feb-2017 10:45:08
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ కుర్ర హీరోలలో విపరీతమైన ఈజ్ తో యాక్టింగ్ చేసి మెప్పించగల ట్యాలెంట్.. రాజ్ తరుణ్ కి ఉంది. తన డిఫరెంట్ మాడ్యులేషన్ అండ్ యాక్టింగ్ లతోనే మెప్పించేస్తాడు కాబట్టే.. కుర్రాడి సినిమాలకు అంత డిమాండ్ ఉంటుంది. నిజానికి అసలు యాక్టింగ్ చేయాలనే ఉద్దేశ్యంతో ఇండస్ట్రీలోకి రాలేదని తనే స్వయంగా చెప్పాడు రాజ్ తరుణ్.

డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లోకి వెళ్దామని అనుకుంటే.. అనుకోకుండా హీరో అయిపోయానని చెప్పే రాజ్ తరుణ్.. ప్రస్తుతం కిట్టు ఉన్నాడు జాగ్రత్త అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు. త్వరలో రిలీజ్ కానున్న ఈ మూవీ కోసం ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన యూనిట్.. అనుకోని షాక్ ఒకటి ఇచ్చింది. 'జానీ జానీ ఎస్ పప్పా.. డ్రింకింగ్ వోడ్కా నో పప్పా' అంటూ.. మందు తాగి కుర్రాళ్లు పాడుకునే ఓ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. మ్యూజికల్ గానే కాదు.. లిరికల్ గా కూడా డిఫరెంట్ గా ఆకట్టుకునే ఈ పాటను రాసింది ఎవరో కాదు. స్వయంగా హీరో రాజ్ తరుణే ఈ పాటను రాయడం విశేషం.

సింపుల్ లైన్స్ తో అయినా.. ప్రొఫెషనల్ లిరిక్ రైటర్ రేంజ్ లో పాట రాసేసి అందరినీ ఆకట్టుకున్నాడు రాజ్ తరుణ్. కుర్రాడు తన కొత్త ట్యాలెంట్ ఇలా చూపించేస్తున్నాడన్న మాట. ఒక్కో సినిమాలో ఒక్కో డిఫరెంట్ యాంగిల్ చూపిస్తున్న రాజ్ తరుణ్ లో.. మరెన్ని ప్రతిభలు దాగున్నాయో!

,  ,  ,  ,  ,