Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Dec-2017 11:16:30
facebook Twitter Googleplus
Photo

క్రికెటర్లలోకెల్లా అత్యంత ప్రజాదరణ కలిగిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరికొద్ది గంటల్లోనే ఓ ఇంటి వాడు కానున్నాడు. కెరీర్ పీక్స్ ఉన్నప్పుడు ఈ పెళ్లేంటని ఆలోచించే క్రీడాకారులున్న ప్రస్తుత తరుణంలో పెళ్లి అంటే చాలా ఇష్టంగానే కాకుండా చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుని మరీ మ్యారేజ్ చేసుకుంటున్నాడంటే నిజంగానే కోహ్లీ సమ్ థింగ్ స్పెషల్ అనే చెప్పాలి. అయినా విరాట్ పెళ్లి ఎవరితో అనే మనమేం బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన పనేమీ లేదు. ఎందుకంటే కోహ్లీ... బాలీవుడ్ హాట్ బ్యూటీ అనుష్క శర్మతో ఇప్పటికే పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన సంగతి మనకు తెలియనిదేమీ కాదు. మరి పెళ్లి కూడా అనుష్కతోనేనా? అనే డౌట్ కూడా మనకు అవసరం లేదు. ఎందుకంటే... క్రికెటర్లకు విశ్రాంతి అవసరమేనని కాస్తంత గట్టిగానే అరిచేసిన కోహ్లీ... ఆ మాటతో దక్కిన లీజర్ ను బాగానే సెలబ్రేట్ చేసుకునేందుకు పక్కా ప్లాన్ రచించుకున్నట్లుగానే ఉంది. పెళ్లి గురించి ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకున్న క్రమంలోనే కోహ్లీ రెస్ట్ గురించి మాట్లాడాడు అన్న కోణంలోనూ ఇప్పుడు చర్చ జరుగుతోంది.

అయినా ఈ సోది మొత్తం తెలిసిందేగా... ఇప్పుడు అసలు సంగతి ఏమిటన్న విషయానికి వస్తే... అందరూ అనుకున్నట్టుగానే కాకుండా... చాలా మందికి ఆశ్చర్యానికి గురి చేస్తూ ఆనుష్క మెడలో మూడు ముళ్లు వేసేందుకు కోహ్లీ ప్లాన్ రెడీ చేసుకున్నాడు. ఓ వైపు ప్రత్యర్థి శ్రీలంక జట్టు దేశంలో పర్యటిస్తుండగా ఆ దేశ జట్టుతో టెస్ట్ సిరీస్ ను గెలిచేసుకుని - కీలకమైన వన్డే సిరీస్ ఉన్నా కూడా దానిని పక్కనపెట్టేసిన కోహ్లీ... ఇటలీ ఫ్లైట్ ఎక్కేశాడు. ఇటలీలోని టస్కనీలో ప్లాన్ చేసిన గ్రాండ్ ఈవెంట్ లో అతడు అనుష్క మెడలో తాళి కట్టనున్నాడు. ఈ మేరకు నిన్నటిదాకా పెద్దగా కన్ ఫార్మ్ లేని వార్తగానే దీనిని భావించినా... ఇప్పుడు టస్కనీలోని ఓ హెరిటేజ్ రిసార్ట్ లో జరుగుతున్న ఏర్పాట్లు చూస్తే విరుష్క పెళ్లి ఖాయమేనన్న వాదనకు బలం చేకూరిందనే చెప్పాలి. సదరు రిసార్ట్లో విరుష్క పెళ్లి పక్కా గుజరాతీ సంప్రదాయంలో జరగనుందట. ఆ మేరకు ఏర్పాట్లన్నీ చాలా వేగంగా సాగుతున్నాయట.

ఇక ఈ పెళ్లి వేడుకకు మరింతగా కిక్కించేందుకు భాంగ్రా నృత్య కళాకారులు కూడా అక్కడికి చేరుకున్నారట. ఈ డ్యాన్సర్ల హడావిడితోనే విరుష్కల పెళ్లి పక్కా అనే వార్తలు బయటకు వచ్చాయట. ఇప్పటికే విరాట్తో పాటుగా అనుష్క కూడా తమకు అత్యంత దగ్గరి వ్యక్తులనుకున్న వారికి తమ వెడ్డింగ్ ఇన్విటేషన్లు ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా... తమ వెడ్డింగ్ తర్వాత గ్రాండ్గా ఇచ్చే రిసెప్షన్ కు సంబంధించిన ఏర్పాట్లను కూడా విరాట్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. పెళ్లి జరిగిన తర్వాత ఈ నెల 26న ముంబైలో రిసెప్షన్ కు భారీ ఏర్పాట్లు చేసుకున్నాడట. మొత్తంగా పరిస్థితి చూస్తుంటే... విరాట్ - అనుష్కల పెళ్లికి సంబంధించి ఇప్పటిదాకా వినిపించిన వదంతులను వారిద్దరూ మరి కొద్ది గంటల్లో నిజం చేసేస్తున్నారన్నమాట.

,  ,  ,  ,  ,