Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Oct-2015 16:35:28
facebook Twitter Googleplus
Photo

అక్కినేని హీరో అఖిల్ నటించిన ఒక్క సినిమా కూడా ఇంకా రిలీజ్ కానేలేదు. కానీ అతడు ఇప్పటికే టాలీవుడ్ లో సూపర్ స్టార్ అన్న పిలుపు అందుకుంటున్నాడు. మొదటి సినిమా అఖిల్ ఈపాటికే దసరా బరిలో రిలీజ్ కావాల్సింది. కానీ గ్రాఫిక్స్ పనుల్లో జాప్యం వాయిదా వేయించింది. ఇకపోతే అఖిల్ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబర్ 11న సోలోగా రిలీజ్ చేస్తున్నారు. వాస్తవానికి దీపావళి రేసులో నిఖిల్ సినిమా శంకరాభరణం రిలీజ్ కి వస్తోందని ఆ చిత్రనిర్మాత కోన వెంకట్ ప్రకటించినా.. అఖిల్ కోసం వాయిదా వేసుకున్నాడు. ఈ సందర్భంగా కోన వెంకట్ మాట్లాడుతూ .. ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు.

హృతిక్ రోషన్ తర్వాత ఓవర్ నైట్ లో స్టార్ అయ్యింది అక్కినేని అఖిల్ మాత్రమే. ఆ తర్వాత ఇంకెవరూ లేనేలేదు.. అని కామెంట్ చేశాడు. అఖిల్ నటించిన అఖిల్ చిత్రానికి కోన రచయితగా పనిచేశారు. డైలాగ్ రైటర్ గా ఈ సినిమాకి కోన పనిచేయడం విశేషం. అలాగే సేమ్ టైమ్ నిఖిల్ సినిమా శంకరాభరణంని నిర్మించాడు. అఖిల్ కోసం తన సినిమాని 20వ తేదీకి వాయిదా వేసుకున్నాడు. గ్రేట్. అఖిల్ సినిమా కంటే ముందు రవితేజ నటించిన బెంగాల్ టైగర్ నవంబర్ 5న రిలీజ్ కి వస్తోంది.

,  ,  ,