Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Sep-2016 11:27:24
facebook Twitter Googleplus
Photo

కొరటాల శివ.. ఇప్పుడీ డైరెక్టర్ పేరే ఓ బ్రాండ్ అయిపోతోంది. వరుసగా మూడు సినిమాలు.. మూడూ పెద్ద పెద్ద స్టార్స్ తోనే చేయడం.. అన్నీ బ్లాక్ బస్టర్స్ అయిపోవడం.. ఆయా హీరోలకు కెరీర్ బెస్ట్ చిత్రాలుగా నిలవడం పెద్ద రికార్డులే. అన్నిటికీ మించి ఇండస్ట్రీ టాప్-5లో శ్రీమంతుడును చేర్చిన కొరటాల.. ఇప్పుడు జనతా గ్యారేజ్ కూడా ఆ లిస్ట్ చేరిపోనుందనే అంచనాల మధ్య తిరుగులేని దర్శకుడు అయిపోయినట్లే.

మరి క్రేజ్ వచ్చాక ఏ ఆర్టిస్ట్ అయినా.. టెక్నీషియన్ అయినా చేసేది ఒకటే. అదే పారితోషికం పెంచేయడం. తొలి సినిమా మిర్చికి ఎంత పుచ్చుకున్నాడో చెప్పలేం కానీ.. శ్రీమంతుడుతో చెప్పుకోదగ్గ స్థాయిలోనే(3కోట్లు అని టాక్) వర్కవుట్ అయింది. రిలీజ్ తర్వాత కూడా మహేష్ దగ్గర నుంచి కాస్ట్లీ కార్ గిఫ్ట్ అందుకున్నాడు కొరటాల శివ. ఆ తర్వాత జనతా గ్యారేజ్ చిత్రానికి 8 కోట్లు పుచ్చుకున్నాడని.. కాదు పది కోట్లు అనే టాక్ ఉంది.

ఇప్పుడు మహేష్ తో చేయనున్న మూవీకి 15 కోట్లు అందుకోబోతున్నాడట కొరటాల శివ. మామూలుగా ఇంటర్వ్యూల్లో ఎంతో సింపుల్ గా ఉండే ఈ డైరెక్టర్.. రెమ్యూనరషన్ దగ్గర మాత్రం గట్టిగానే ఉంటున్నాడట. తనపేరు-స్టార్ హీరో ఉంటే కనీసం 70 కోట్లు వచ్చేస్తాయ్ కాబట్టి.. ఆ మాత్రం ఇస్తేనే సినిమా అంటున్నాడని టాక్. ఈ లెక్కన మహేష్ తో చేయనున్న సినిమాకి రెమ్యూనరేషన్ ల లెక్కే 45 కోట్లు దాటుతుంది కదా. మహేష్ కి 20 నుంచి 25 కోట్లు ముట్టచెబుతున్నారు నిర్మాతలు.

,  ,  ,  ,  ,