Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Jun-2016 15:33:22
facebook Twitter Googleplus
Photo

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గతేడాది అక్టోబర్ లో ఈ సినిమా పూజ కార్యక్రమాలను జరుపుకొని ఈ ఏడాది ఆగస్టులో కృష్ణ పుష్కరాల సందర్భంగా విడుదల చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో మొదలైంది. ఆగస్టులో విడుదల చేస్తామని ప్రకటించారు, మరి అది సాధ్యమా అని అంతా అనుకున్నారు. కానీ కొరటాల శివ పక్కా ప్లానింగ్ తో ఈ సినిమా షూటింగ్ ని మొదలుపెట్టి పూర్తి చేసి అందరికి ఆశ్చర్యాన్ని కలిగించాడు. నిన్న ఈ సినిమాకి సంబందించిన టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. మూడు పాటలు మాత్రమే మిగిలినాయి. వచ్చే నెలలో ఈ పాటలను చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు డబ్బింగ్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఓ స్టార్ హీరోతో, అనుకున్న బడ్జెట్ తో ఇంత త్వరగా సినిమాని పూర్తి చేయడం అంటే మాములు విషయం కాదు.

,  ,  ,  ,  ,  ,