Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Sep-2016 16:34:28
facebook Twitter Googleplus
Photo

ప్రస్తుతం ఇండస్ట్రీ లో కొరటాల శివ పేరు మారుమోగిపోతుంది..ఏ నోటా విన్న , ఎవరు మాట్లాడుకున్న సినిమా పరిశ్రమలో ఇతడి గురించే మాట్లాడుకుంటున్నారు..డైలాగ్ రైటర్ గా కెరియర్ మొదలు పెట్టిన శివ, మిర్చి చిత్రం తో డైరెక్టర్ గా పరిచయం అయి , మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ కొట్టాడు.

ఆ తర్వాత మహేష్ శ్రీమంతుడు తో తన స్థాయిని పెంచుకున్నాడు. ఇక తాజాగా జనతా గ్యారేజ్ చిత్రం తో టాలీవుడ్ రికార్డ్స్ బ్రేక్ చేయగల మంచి విజన్ ఉన్న డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇక హ్యాట్రిక్ విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న శివ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సరిపడా స్టోరీ రెడీ చేయబోతున్నాడట. ఇప్పటికే పవన్ కోసం ఓ కథ సిద్ధం చేసాడట. కాకపోతే దానిలో కొన్ని మార్పులు , చేర్పులు చేయాలనీ శివ చెప్తున్నాడు. ప్రస్తుతం మహేష్ , ప్రభాస్ లతో సినిమా చేయడానికి రెడీ ఉన్నశివ , త్వరలోనే పవన్ కథ సిద్ధం చేసి అతడికి వినిపించబోతాడట..

,  ,  ,  ,