Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Jun-2017 12:17:36
facebook Twitter Googleplus
Photo

రజినీకాంత్ తో నరసింహ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తీసిన దర్శకుడు కేఎస్ రవికుమార్.. ఇప్పుడు బాలకృష్ణ మరుసటి చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. బాలయ్య 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి తమిళ్ వెర్షన్ ట్రైలర్ లాంఛ్ కు హాజరైన ఈ దర్శకుడు.. ఈ చిత్రాన్ని 79 రోజుల్లో పూర్తి చేసినట్లు తెలిసి ఆశ్చర్యపోయానంటున్నాడు. ఇలా చేసేందుకు పంక్చువాలిటీ చాలా ముఖ్యమని.. ఈ విషయంలో తండ్రి నుంచి బాలకృష్ణ ఎన్నో నేర్చుకున్నారని అన్నాడు.

ఎన్టీఆర్ గారి గురించి నాకు నగేష్ చెప్పారు. అప్పట్లో నగేష్ తెలుగు-తమిళ్ సినిమాలతో తెగ బిజీగా ఉండేవారు. ఎన్టీఆర్ సినిమా షూటింగ్ కి హైద్రాబాద్ వెళ్లేందుకు గాను.. ఓ సారి ఉదయాన్నే ఫ్లైట్ ఎక్కాల్సి ఉంది. అయితే ఎయిర్ పోర్టుకు రావడం లేట్ అవడం.. ఆ తర్వాత ఫ్లైట్ కు బయల్దేరడం జరిగాయి. తీరా ఫ్లైట్ ఎక్కి కూర్చున్నాక పక్కకు చూస్తే.. పక్కనే శ్రీకృష్ణుడి గెటప్ లో ఉన్న ఎన్టీఆర్ దర్శనం కలిగింది. అదేంటని నగేష్ అడిగితే.. మనం హైద్రాబాద్ చేరుకుని షూటింగ్ స్పాట్ కి వెళ్లేసరికి 2 గంటలు లేట్ అవుతుంది. కరెక్ట్ టైంకి షూటింగ్ స్టార్ట్ చేసేందుకే ఇలా సిద్ధమైపోయాను అని ఎన్టీఆర్ చెప్పారట అంటూ ఎన్టీఆర్ పంక్చువాలిటీ గురించి చెప్పాడు కేఎస్ రవికుమార్.

తాను రజినీకాంత్ తో రాణా అనే పేరుతో చారిత్రక చిత్రాన్ని తీయాలని భావించానని చెప్పిన ఈ దర్శకుడు.. ఇందుకోసం 276 రోజుల పాటు షూటింగ్ ప్లాన్ చేసినట్లు తెలిపాడు.

,  ,  ,  ,  ,