Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Jun-2017 11:16:03
facebook Twitter Googleplus
Photo

కాదలి చిత్రం ఆడియో లాంఛ్ కు చీఫ్ గెస్ట్ గా వచ్చిన కేటీఆర్.. ఇది తన బాల్య స్నేహితుడి చిత్రం కావడంతో సొంత సినిమా మాదిరిగానే మాట్లాడడం విశేషం. అందరికీ నమస్కారం అంటూ స్పీచ్ ప్రారంభించిన కేటీఆర్.. నా మిత్రుడు.. బాల్య మిత్రుడు పట్టాభి ఆర్. చిలుకూరి దర్శకుడిగా మారుతూ తీసిన మూవీ ఇది. ఇది అతని సుదీర్ఘమైన కల. ముందుగా రామ్ చరణ్ కు కృతజ్ఞతలు. ఒక స్నేహితుడి కల నెరవేరేందుకు మాకు ఓ స్టార్ పవర్ అవసరం అనిపించింది. పొలిటికల్ లీడర్స్ వస్తే.. జనాలకు ఎక్కదన్న ఉద్దేశ్యంతో రామ్ చరణ్ ను అడిగాం. ఒక్క మాట అడగ్గానే చాలా దూరం నుంచి జర్నీ చేసిన వచ్చాడు. థాంక్యూ చరణ్ అన్నారు కేటీఆర్.
కాదలి చిత్రం అంతా కొత్తగా కనిపిస్తోంది. హరీష్.. సాయి.. పూజ.. వనమాలి.. శేఖర్ జోసెఫ్.. ఇలా మొత్తం టీం అంతా సూపర్బ్ గా ఉంది. చిన్న సినిమా అయినా కొత్త ప్రొడక్షన్ హౌస్.. కొత్త దర్శకుడు.. విజువల్స్ చాలా ఫ్రెష్ గా అనిపిస్తున్నాయి. దిల్ రాజు గారి చెప్పినట్లు పెళ్లిచూపులు ఓ బెంచ్ మార్క్ సెట్ చేసింది. కంటెంట్ బాగుంటే ఏ సినిమా అయినా సక్సెస్ అవుతుందని ప్రేక్షకులు ప్రూవ్ చేశారు. నాకు పట్టాభి 25ఏళ్ల క్రితం నుంచే తెలుసు. అప్పటి నుంచే తను సినిమాలకు అభిమాని. 2001లో అనుకుంటా.. అప్పుడే మాకు కాలేజ్ అయిపోయింది. అప్పుడే తను సురేష్ ప్రొడక్షన్స్ కు.. వెంకటేష్ కు పెద్ద ఫ్యాన్. అప్పట్లో సురేష్ ప్రొడక్షన్స్ కి ఓ లెటర్ రాశాడు. ఆ లెటర్ కు రియాక్ట్ అయిన సురేష్ బాబు.. క్రాఫ్ట్స్ నేర్చుకునే అవకాశం ఇవకాశం ఇవ్వడం సురేష్ గారి గొప్పదనం. అంటూ పాత జ్ఞాపకాలను కూడా చెప్పారు కేటీఆర్.

ఇండియన్ మూవీ ఖ్యాతిని చాటి చెప్పిన మూవీ బాహుబలి. అమెరికా వెళ్లినపుడు అక్కడి వ్యక్తులు కూడా బాహుబలి గురించి చెప్పుకుంటున్నారు. మన సినిమా స్థాయి ఆ రేంజ్ కు చేరుకుంది. ఇక జీఎస్టీ గురించి అయితే.. ఒక పరిశ్రమకు ఒకటే పన్ను ఉండడం అన్నది తప్పనిసరి. మన తరఫున అడిగాం కానీ.. 28 శాతం పన్ను విధించారు. మన పరిశ్రమను కాపాడకోవడం మన బాధ్యత.

,  ,  ,  ,  ,  ,  ,