Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Jul-2017 12:40:43
facebook Twitter Googleplus
Photo

జై లవకుశ మీద అంచనాల్ని ఒకేసారి అమాంతం పెంచేసింది ఆ చిత్ర బృందం. వారం కిందట రిలీజైన జై టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఐతే జై లవకుశ టీం ఈ ఒక్క టీజర్ తో సరిపెట్టట్లేదు. ఇందులో ఎన్టీఆర్ పోషిస్తున్న మూడు పాత్రలకు సంబంధించి మూడు టీజర్లు రిలీజ్ చేయబోతున్నట్లు ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. జై వచ్చేశాడు కాబట్టి ఇక లవ. కుశ కూడా రావాల్సి ఉంది.

ప్రస్తుతం డైరెక్టర్ బాబీ అండ్ కో ఆ సన్నాహాల్లోనే ఉన్నట్లు సమాచారం. ఈ నెలాఖర్లోనే లవ పాత్రకు సంబంధించిన టీజర్ రిలీజ్ చేస్తారట. ఆ తర్వాత రెండు వారాల గ్యాప్ లో కుశ క్యారెక్టర్ టీజర్ లాంచ్ చేస్తారట. ఇంకొన్ని రోజుల్లోనే లవ టీజర్ డేట్ ను నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ ప్రకటిస్తారని అంటున్నారు. మరి మిగతా రెండు టీజర్లు కూడా జై టీజర్ స్థాయిలోనే ఉంటాయేమో చూడాలి. ఆగస్టు నెలాఖర్లో ఆడియో వేడుక చేయాలనుకుంటున్నారు. అప్పుడే థియేట్రికల్ ట్రైలర్ కూడా వస్తుంది.

ప్రస్తుతం జై లవకుశ షూటింగ్ పుణె దగ్గర్లో జరుగుతోంది. అక్కడే బిగ్ బాస్ షోకు సంబంధించిన షూటింగ్ లోనూ పాల్గొంటున్నాడు తారక్. ఈ షో తొలి ఎపిసోడ్ ఈ ఆదివారమే స్టార్ మా ఛానెల్లో ప్రసారం కాబోతోంది. అటు సినిమా.. ఇటు షో షూటింగ్ లో సమాంతరంగా పాల్గొంటూ రెంటినీ సమయానికి పూర్తి చేసేలా ప్లాన్ చేసుకున్నాడు తారక్.

,  ,  ,  ,  ,