Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Jun-2016 13:17:33
facebook Twitter Googleplus
Photo

మొన్నటివరకు వరుణ్ తేజ్ ''మిష్టర్'' సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్న అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి.. ఇప్పుడు ఆ సినిమాపై ఆశలు వదులకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ సినిమా గురించి నానా రూమర్లు వినిపిస్తున్న తరుణంలో అసలు ఏ సినిమాతో తాను టాప్ లీగ్ లోకి ఎంటరవ్వలా అనే స్కెచ్ వేసుకుంటోందట అమ్మడు.

నిజానికి భలే భలే మగాడివోయ్ అండ్ సోగ్గాడే చిన్ని నాయనా సక్సెస్ తరువాత ఇంతవరకు లావణ్య తన తదుపరి సినిమాలో మెరవలేదు. అయితే నూతన దర్శకుడు చంద్రమోహన్ ఇప్పుడు శర్వానంద్ తో తీస్తున్న సినిమాలో ఈమె తన గ్లామర్ డోస్ స్థాయిని మరింత పెంచే పనిలో పడిందట. మొన్నటివరకు మిష్టర్ తో తన గ్లామర్ స్థాయి పీక్స్ కు తీసుకెళ్ళాలని అనుకున్నా.. ఇప్పుడు మాత్రం శర్వా సినిమాతో టాలీవుడ్ లో టాప్ గ్లామరస్ స్టార్ గా కిక్కిచ్చి ఆ తరువాత నెం.1 స్థానానికి ఎగబాకాలనేది లావణ్య ఐడియా.

ఈ మధ్య కాలంలో చాలామంది స్టార్ హీరోయిన్లు.. సమంత.. రకుల్ ప్రీత్.. శృతి హాసన్.. ఇలా గ్లామరస్ డోస్ పెంచాకే టాప్ స్టార్లు అయ్యారు. చూద్దాం మరి మన లావణ్య త్రిపాఠి ఏ రేంజులో ఆకట్టుకుంటుందో!

,  ,  ,  ,  ,