Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Jun-2017 11:00:38
facebook Twitter Googleplus
Photo

ఒకళ్ళేమో చిన్నప్పుడే పవన్ కళ్యాణ్ సినిమాల్లోని సీన్లను యాజిటీజ్ గా దించేసి.. ఆ విధంగా ఒక డైరక్టర్ ను ఆడిషన్ లో ఇంప్రెస్ చేసి.. ఏకంగా సినిమా హీరో అయిపోయాడు. మరొకరేమో.. అదే రక్తం పంచుకుని పుట్టి .. ఆ తరువాత ఆయన్ను చూసి ప్రేరణ పొంది.. హీరో అయిపోయాడు. ఈ ఇద్దరూ ఒక విధంగా హార్డుకోర్ పవర్ స్టార్ అభిమానులు. ఇప్పుడు ఈ ఇద్దరూ తలపడుతున్నారు. ఎవరో అర్ధమైందిగా..

జయం సినిమా ఆడిషన్లో పవన్ సీన్లను ఇమిటేట్ చేసి హీరో అయ్యానని చెప్పిన నితిన్.. ఇప్పుడు లై అనే సినిమాతో వస్తున్నాడు. హను రాఘవపూడి డైరక్షన్లో రూపొందిన ఈ లవ్ స్టోరీలో కావల్సినంత లవ్ ఉందంట. ఇకపోతే కొత్తమ్మాయి మేఘా ఆకాష్ కూడా తన డస్కీ లుక్స్ లో ఆల్రెడీ అందరినీ బాగానే ఇంప్రెస్ చేసింది. ఈ సినిమాను రిలీజ్ ను ఆగస్టు 11 అంటూ ప్రకటించేశారు. మా మావయ్యలు ఇద్దరూ నాకు రెండు కళ్ళు అని చెప్పే మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా ఇటు జవాన్ సినిమాను రిలీజ్ చేస్తున్నాడు. రైటర్ బివిఎస్ డైరక్షన్లో రూపొందిన ఈ సినిమాతో తనకు ఈ మధ్యన తగులుతున్న ఫ్లాపు దెబ్బలను తప్పించుకుని హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. ఈ సినిమాను కూడా ఆగస్టు 11నే దించుతున్నారు.

ఇంకా రెండు నెలల టైమ్ ఉన్న ఈ సినిమాల రిలీజుల గురించి ఇంత గొప్పగా చెప్పుకోవడం దేనికంటే.. మనోళ్ళు ఈసారి బాలీవుడ్ తరహాలో ఇండిపెండెన్స్ డే వీకెండ్ ను గట్టిగానే టార్గెట్ చేశారు కాబట్టి. ఆగస్టు 15 సెలవ మంగళవారం రావడంతో.. చాలామంది మండే కూడా సెలవపెట్టేసి.. 12 నుండి 15 వరకు సెలవులు తీసుకునే ఛాన్సుంది. అందుకే 11న సినిమాను రిలీజ్ చేస్తే.. ఏకంగా 5 రోజులు కుమ్ముకోవచ్చు.

,  ,  ,  ,  ,