Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Jan-2015 10:28:23
facebook Twitter Googleplus
Photo

ఇటీవలి కాలంలో మంచి హిట్టు సినిమాగా పేరు తెచ్చుకున్న 'లౌక్యం' సినిమాని టీవీలో ప్రసారం చేసేస్తున్నారు. వరుస ఫ్లాపుల్లో వున్న యాక్షన్ హీరో గోపీచంద్ కు మంచి సక్సెస్ నిచ్చి, అతని కెరీర్ని నిలబెట్టిన ఈ చిత్రం శాటిలైట్ హక్కులను 'జీ'టీవీ మంచి రేటుకి తీసుకుంది. దాంతో, చిత్రానికున్న క్రేజును ఉపయోగించుకునే క్రమంలో ఈ నెల 11 ఆదివారం సాయంకాలం 6 గంటలకు జీ తెలుగు చానెల్ దీనిని ప్రసారం చేస్తోంది. శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో టాలీవుడ్ తాజా అందం రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటించింది. సో, ధియేటర్లో ఈ చిత్రాన్ని మిస్సయిన వాళ్లు ఈ నెల 11న టీవీలలో ఫ్రీగా చూసేయచ్చన్నమాట!

,  ,  ,  ,  ,