Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Dec-2016 12:10:44
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ లో పక్క భాషల భామలను అరువు తెచ్చుకోవడం కొత్తేమీ కాదు. అందచందాలు ఆరేయడంలో తెలుగు భామలు పొదుపు పాటించడం.. సాంప్రదాయాలు వల్లించడం లాంటివి చేస్తారనే భయంతో.. దర్శకనిర్మాతలు ఎక్కువగా పరాయి భాషలపై డిపెండ్ అవుతుంటారు. పక్క రాష్ట్రాలకే కాకుండే.. దేశాలు దాటిపోవడం.. ఖండాలు దాటి కొత్త భామలను పట్టుకురావడం కూడా మొదలైపోయింది.

మంచు విష్ణు లేటెస్ట్ మూవీ లక్కున్నోడు కోసం ఆస్ట్రేలియన్ సుందరాంగి లూసిండా నికొలాస్ ను తీసుకొస్తున్నారు. మూవీలో మాంచి టైమింగ్ తో వచ్చే ఐటెం సాంగ్ లో ఈ భామ చిందులేయనుందట. స్పెషల్ సాంగ్ కు ఈమెనే స్పెషల్ గా ఎంచుకోడానికి కారణాలు కూడా ఉన్నాయి. ఆస్ట్రేలియా లూసిండా ఓ సూపర్ మోడల్ మాత్రమే కాదు.. యోగ గురు కూడా. ఆమె చేసే ఎనర్జిటిక్ డాన్స్ లు అక్కడ బాగా ఫేమస్. ఆ ఎనర్జీని తెలుగు ఆడియన్స్ కు కూడా చూపించేందుకు తాపత్రయపడుతున్నాడు లక్కున్నోడు. గతంలో ఈమె అక్షయ్ కుమార్ మూవీ బాస్ లో కూడా చిందులేసింది.

ఇలా స్పెషల్ సాంగ్స్ కోసం ఇండియా వచ్చిన విదేశీ భామలు మరికొంత మంది ఇక్కడ చెలరేగిపోతున్నారు. స్కార్లెట్ విల్సన్ ను ఇంగ్లండ్ నుంచి.. గాబ్రియెలలా డెమెట్రియాడ్స్ ను సౌత్ ఆఫ్రికా నుంచి... నథాలియా కౌర్-లారిస్సా బొనేసి-గాబ్రెయెలా బెర్నాంటే లను బ్రెజిల్ నుంచి.. నోరా ఫతేహీలను కెనడానుంచి టాలీవుడ్ కి పట్టుకొచ్చారు మూవీ మేకర్స్.

,  ,  ,  ,  ,