Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Aug-2017 11:21:30
facebook Twitter Googleplus
Photo

హీరోలకు అన్నీ మంచి లక్షణాలే ఉండేవి. హీరోను అత్యంత బలవంతుడిగా.. ఏ లోపాలూ లేని వాడిగా చూపించేవాళ్లు. కానీ గత కొన్నేళ్లలో ట్రెండు మారింది. హీరోకు చాలా అవలక్షణాల్నే ఆపాదిస్తున్నారు. అలాగే కొత్తదనం కోసం హీరోలకు ఏదో ఒక లోపాన్ని కూడా పెడుతున్నారు. దాన్నుంచే వినోదం పండిస్తున్నారు. దర్శకుడు మారుతి.. ‘భలే భలే మగాడివోయ్’లో హీరోను మతిమరుపు వాడిగా చూపించి అదిరిపోయే వినోదాన్నందించాడు. బ్లాక్ బస్టర్ కొట్టాడు. మధ్యలో బాబు బంగారం తో గాడి తప్పిన మారుతి.. మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కేందుకు మళ్లీ భలే భలే.. మార్గాన్నే ఎంచుకున్నాడు. అంటే హీరోను పెద్ద లోపం ఉన్నవాడిగా చూపిస్తున్నాడు.

భలే భలే..లో నాని మతిమరుపు వాడైతే.. మారుతి కొత్త సినిమా మహానుభావుడు లో హీరో శర్వానంద్ ఓసీడీతో బాధపడే కుర్రాడిగా నటిస్తున్నాడు. ఓసీడీ అంటే.. అతి శుభ్రతతో బాధపడే ఒక డిసార్డర్ అన్నమాట. దీంతో బాధపడేవాళ్లకు దేన్నయినా అతిగా శుభ్రం చేయడం.. అపరిశుభ్రత గురించి తెగ కంగారు పడటం అలవాటు. ‘భలే భలే..’లో మతిమరుపు కాన్సెప్ట్ లాగే ఇది కూడా హిలేరియస్ గా వర్కవుటైనట్లే కనిపిస్తోంది ‘మహానుభావుడు’ టీజర్ చూస్తుంటే. బాస్ ఏదో చెప్పబోతూ తుమ్ముతుంటే.. పరుగెత్తుకెళ్లిపోయి ఆఫీసులో ఓ మూలకు వెళ్లిపోవడం మొదలు.. ఓసీడీ డీసార్డర్ వల్ల హీరో విచిత్ర విన్యాసాలు అన్నీ ఇన్నీ కావు. చివరికి హీరోయిన్ ముద్దివ్వబోతుంటే బ్రష్ చేశావా అనే స్థాయికి చేరుతుంది అతడి పిచ్చి. మొత్తానికి మహానుభావుడు టీజర్ చూస్తే.. మారుతి ఈజ్ బ్యాక్ అనే అనిపిస్తోంది. భలే భలే.. సినిమా నిర్మాణంలో భాగస్వాములైన యువి క్రియేషన్స్ వాళ్లే ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తుండటం విశేషం. కృష్ణగాడి వీర ప్రేమ గాథ ఫేమ్ మెహ్రీన్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.

,  ,  ,  ,