Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Dec-2015 12:03:09
facebook Twitter Googleplus
Photo

దర్శకుడు విక్రమ్ కుమార్ గురించి ప్రస్తుత జనరేషన్ సగటు తెలుగు అభిమానికి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ?13 బీ?, ?ఇష్క్? సినిమాలతో మెప్పించి ఆ తర్వాత ?మనం? సినిమాతో తెలుగులో తనదైన బ్రాండ్ సెట్ చేసుకున్న ఈ దర్శకుడు తాజాగా ఓ సైన్స్ ఫిక్షన్ కథతో ?24? పేరుతో ఓ సినిమాను సిద్ధం చేస్తోన్న విషయం తెలిసిందే. తమిళ సూపర్ స్టార్ సూర్య హీరోగా నటించిన ఈ సినిమా సమ్మర్ కానుకగా విడుదల కానుంది. ఇక ఇదిలా ఉంచితే ?24? తర్వాత తాను చేయబోయే సినిమాల గురించి విక్రమ్ కుమార్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఓ ప్రముఖ తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు విక్రమ్ కుమార్ మాట్లాడుతూ.. 24 తర్వాత తాను చేయబోయే రెండు సినిమాలూ తెలుగు హీరోలతోనే ఉంటాయని తెలిపారు. అందులో ఒకటి సూపర్ స్టార్ మహేష్ బాబు, మరొకటి అల్లు అర్జున్‌తో ఉంటాయని ఆయన అన్నారు. ఇక గతంలోనే విక్రమ్ కుమార్ మహేష్‌తో ఓ సినిమా చేయాల్సి ఉండగా అది వర్కవుట్ కాలేదు. తాజాగా వీరిద్దరూ మళ్ళీ జతకట్టనుండడం విశేషంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మహేష్ ?బ్రహ్మోత్సవం?తో పాటు ఏ.ఆర్.మురుగదాస్‌తో ఓ సినిమాలను లైన్లో పెట్టి బిజీగా ఉన్నారు. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం ?సరైనోడు?తో బిజీగా ఉన్నా, సమ్మర్ కల్లా ఫ్రీ అయిపోనుండడంతో విక్రమ్ కుమార్ ?24? తర్వాత అల్లు అర్జున్‌తోనే జతకట్టే అవకాశం కనిపిస్తోంది.

,  ,  ,