Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-May-2016 17:03:27
facebook Twitter Googleplus
Photo

మహేష్ బాబు- శ్రీకాంత్ అడ్డాల.. రెండు రోజుల క్రితం వరకూ టాలీవుడ్ లో ఇదో క్రేజీ కాంబినేషన్. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో.. కొత్త ట్రెండ్ కి నాంది పలికిన ఈ డైరెక్టర్.. ఇప్పుడు బ్రహ్మోత్సవంతో వెనకడుగు వేసినట్లయింది. ముఖ్యంగా మహేష్ తో ఇలాంటి కంటెంట్ కనిపించని సినిమా చేయడంపై ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. అయితే.. మూవీ రిలీజ్ కి ముందు శ్రీకాంత్ అడ్డాలతో మహేష్ మూడో సినిమా అనే టాక్ వచ్చింది.

అటు మహేష్ కానీ ఇటు డైరెక్టర్ కానీ ఎవరూ కన్ఫాం చేయకపోయినా.. అడ్డాలను స్క్రిప్ట్ రెడీ చేసుకోమని మహేష్ చెప్పాడని అన్నారు. ఇప్పుడు బ్రహ్మోత్సవం రిజల్ట్ తర్వాత కూడా ఈ సినిమా ఉంటుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఇక్కడ మహేష్ సినిమాల హిస్టరీ చూస్తే.. శ్రీకాంత్ అడ్డాలకు మరో ఛాన్స్ ఇవ్వచ్చనే అంటున్నారు. సూపర్ స్టార్ కు ఒక్కడు లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు గుణ శేఖర్. ఆ తర్వాత వెంటనే చేసిన అర్జున్ నిరాశకు గురి చేసింది.

ఒక హిట్ - ఒక ఫ్లాప్ ఇచ్చిన తర్వాత.. మళ్లీ రెండేళ్లకు గుణశేఖర్ కి మరో ఛాన్స్ ఇచ్చాడు మహేష్. వీరిద్దరి కాంబినేషన్ లో ముచ్చటగా సైనికుడు వచ్చింది కానీ.. అది కూడా తేడా కొట్టింది. ఆ తర్వాత ఇక గుణతో సినిమా చేయలేదు మహేష్. ఇప్పుడు కూడా శ్రీకాంత్ అడ్డాలకు మరో అవకాశం ఇవ్వచ్చని అంటున్నారు. అయితే.. వెంటనే కాకపోయినా ఓ రెండు - మూడేళ్ల తర్వాత మహేష్-శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ మరో ఎటెంప్ట్ చేయచ్చని తెలుస్తోంది. ఈసారైనా మహేష్ నమ్మకాన్ని శ్రీకాంత్ అడ్డాల నిలబెడతాడని కోరుకుందాం

,  ,  ,  ,  ,  ,