Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-May-2016 11:19:00
facebook Twitter Googleplus
Photo

పూరి జగన్నాథ్ ప్రస్తుతం ఉన్న ఫామ్ లో మహేష్ బాబుతో సినిమా చేస్తాడంటే ఎవ్వరికీ నమ్మకాల్లేవు. మొన్న ?జనగణమన? అంటూ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేసినా.. ఏదో తమాషాకు చేసినట్లే అనిపించింది. నిజంగా మహేష్ పూరితో సినిమా చేస్తాడా అని సందేహించారు జనాలు. ఐతే మహేష్ మాటల్ని బట్టి చూస్తుంటే ఇద్దరి కాంబినేషన్లో అతి త్వరలోనే సినిమా ఉండేలా కనిపిస్తోంది. ఈ ఏడాదే ఆ చిత్రం సెట్స్ మీదికి వెళ్లేలా కనిపిస్తోంది.

?బ్రహ్మోత్సవం? ప్రమోషన్లలో భాగంగా తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి చెబుతూ.. ఇంకోమూడు వారాల్లోనే మురుగదాస్ తో సినిమా మొదలవుతుందని వెల్లడించిన మహేష్.. పూరితో కథా చర్చలు జరుగుతున్నట్లు ప్రకటించాడు. మురుగదాస్ సినిమా అయ్యాక తాను చేసే సినిమా ఇదే కావచ్చని చెప్పాడు. మహేష్ కోసం ఎంతోమంది సక్సెస్ ఫుల్ దర్శకులు లైన్లో ఉండగా.. అతను మాత్రం పూరికే ఓటు వేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

?పోకిరి? కన్నా రూత్ లెస్.. ?బిజినెస్ మేన్? కన్నా పవర్ ఫుల్ అంటూ పూరి కొన్ని రోజుల కిందట ?జనగణమన? పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. మహేష్ కోసమని దిల్ రాజు దగ్గర్నుంచి ఈ టైటిల్ తీసుకున్నాడు పూరి. ?బిజినెస్ మేన్?కు ముందు కూడా పూరి ఫామ్ లో లేకపోయినప్పటికీ.. మహేష్ తో సినిమా అనేసరికి పవర్ ఫుల్ స్క్రిప్టే తయారు చేశాడు. సక్సెస్ కొట్టాడు. మరి ఈసారి మహేష్ కోసం పూరి ఎలాంటి స్టోరీ రాస్తాడో.. ఆ సినిమా ఎలా తీస్తాడో చూడాలి.

,  ,  ,  ,  ,