Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-May-2017 11:43:38
facebook Twitter Googleplus
Photo

దర్శక ధీరుడు రాజమౌళి.. సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో ఓ సినిమా వస్తే చూడాలని తెలుగు ప్రేక్షకులు ఎప్పట్నుంచో కోరుకుంటున్నారు. ఐతే ఈ కాంబినేషన్ ఎప్పటికి వర్కవుట్ అవుతుందో తెలియట్లేదు. బాహుబలి: ది బిగినింగ్ విడుదలయ్యే ముందు ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ.. మహేష్ తో సినిమాకు కమిట్మెంట్ ఉందని.. త్వరలోనే తమ కాంబినేషన్లో సినిమా ఉంటుందని ప్రకటించడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. కానీ ‘బాహుబలి’ రెండో భాగం కూడా విడుదలైనా.. మహేష్ సినిమా ఊసు ఎత్తట్లేదు జక్కన్న. మరోవైపు మహేష్ వరుసగా సినిమాల్ని లైన్లో పెట్టేస్తున్నాడు. దీంతో వీళ్లిద్దరి కాంబినేషన్లో ఇప్పుడిప్పుడే సినిమా ఉండదనే అభిప్రాయానికి వచ్చేశారు జనాలు.

ఐతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాది రాజమౌళి-మహేష్ కాంబినేషన్లో సినిమా తెరకెక్కే అవకాశాలున్నాయట. తన తర్వాతి ప్రాజెక్టును వేరే హీరోతో చేయబోతున్న రాజమౌళి.. ఆ తర్వాత మహేష్ హీరోగా సినిమాను తెరకెక్కించాలని భావిస్తున్నాడట. ఈ మేరకు సీనియర్ ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణకు రాజమౌళి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. నారాయణకు సినిమా చేస్తానని రాజమౌళి ఎప్పుడో కమిట్మెంట్ ఇచ్చాడు. కానీ ఆ మాట అలాగే ఉండిపోయింది. బాహుబలి నుంచి బయటికి రాగానే నారాయణతో టచ్ లోకి వచ్చి సినిమా చేద్దామని అన్నాడట రాజమౌళి. ఈ సినిమాను మహేష్ తో చేయాలన్నది నారాయణ కోరిక. మహేష్ కూడా ఇందుకు సుముఖంగానే ఉన్నాడు.

,  ,  ,  ,  ,