Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Oct-2016 11:00:30
facebook Twitter Googleplus
Photo

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ మురగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతోంది. ఒకటీ అరా చిత్రాలకు మినహాయిస్తే.. మహేష్ ముందు టైటిల్స్ డిసైడ్ అయ్యాకే సినిమాలు మొదలుపెడుతూ ఉంటాడు. రీసెంట్ మూవీ బ్రహ్మోత్సవం విషయంలో కూడా ఇదే జరిగింది. కానీ మురుగదాస్ తో చేయనున్న ద్విభాషా చిత్రానికి మాత్రం టైటిల్ సెట్ కాకుండానే షూటింగ్ చేసేస్తుండడంతో రకరకాల టైటిల్స్ ప్రచారం లోకి వస్తున్నాయి.

మొదట ఎనిమీ.. ఆ తర్వాత వాస్కోడిగామా.. రీసెంట్ గా అభిమన్యుడు అనే టైటిల్స్ సెట్ చేసినట్లుగా వార్తలొచ్చాయి. వీటన్నిటినీ ఎప్పటికప్పుడు యూనిట్ ఖండిస్తూనే ఉంది కానీ.. ఇప్పుడో కొత్త టైటిల్ సర్క్యులేట్ అవుతోంది. 'ఏజంట్ శివ' అనే టైటిల్ ని సెట్ చేశారని.. దాదాపు ఖాయం చేసినట్లేనని అంటున్నారు. ఈ సినిమాలో మహేష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా నటిస్తుండడం.. తెలుగు తమిళ భాషల్లో ఒకే టైటిల్ ని పెట్టేందుకు యూనిట్ ప్రయత్నిస్తుండడం.. ఏజంట్ శివ అనే టైటిల్ సూటబుల్ అనేందుకు ఆస్కారం ఇస్తోంది.

మరోవైపు సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఏజంట్ గోపి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అటు తండ్రి సినిమాని గుర్తు చేసేలా ఉండడం కూడా ఏజంట్ శివకు మహేష్ కు మొగ్గడానికి కారణంగా చెప్పేస్తున్నారు. ఈ కొత్త టైటిల్ కన్విన్సింగ్ గానే కాదు.. అట్రాక్టివ్ గా కూడా ఉంది.

,  ,  ,  ,  ,  ,