Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Sep-2017 13:46:57
facebook Twitter Googleplus
Photo

మహేష్ బాబులో ఎక్కడ లేని మార్పు కనిపిస్తోంది. తన సినిమాల ఆడియో వేడుకల్లో అయినా.. ప్రెస్ మీట్లలో అయినా చాలా తక్కువగా మాట్లాడుతూ.. కొంచెం ముభావంగా కనిపించే మహేష్.. ఈ సినిమా విషయంలో మాత్రం భిన్నంగా కనిపిస్తున్నాడు. గలగలా మాట్లాడేస్తూ.. చాలా సరదాగా వ్యవహరిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర ప్రి రిలీజ్ ప్రెస్ మీట్లో మహేష్ చాలా సరదాగా వ్యవహరించాడు. ఈ ప్రెస్ మీట్ చివర్లో ఓ విలేకరి హీరోయిన్ రకుల్ ప్రీత్ ను స్పైడర్ టీజర్లో వినిపించిన బ్లైండ్ డేట్ అనే మాట గురించి అడిగాడు. మీకు నిజ జీవితంలో మీరు ఎవరితోనూ బ్లైండ్ డేట్ చేయలేదా అని అడిగాడు. దానికి రకుల్ బదులిస్తూ.. లేదు.. దాని కోసమే ఎదురు చూస్తున్నా అని బదులిచ్చింది.

ఇంతలో మహేష్ మైక్ అందుకుని... మీరలా అనకూడదు. బ్లైండ్ డేట్ అంటే అది చాలా దారుణంగా ఉంటుంది అంటూ చమత్కరించాడు. మరో విలేకరి స్పైడర్ లో రకుల్ పాత్ర గురించి అడగబోతుంటే.. రకుల్ కు ఆ విషయం అర్థం కాలేదు. అప్పుడు మహేష్ మళ్లీ మైకందుకుని.. మీరేం అడుగుతున్నారో నాకర్థమైంది. నేను సమాధానం చెబుతా. మురుగదాస్ గారి సినిమాల్లో హీరోయిన్ పాత్ర తక్కువగా అనిపించినా.. చాలా ప్రాధాన్యంతో ఉంటుంది. సీరియస్ గా సాగే ఆయన సినిమాల్లో హీరోయిన్ ట్రాక్ రిలీఫ్ ఇస్తుంటుంది. ఆయన అందమైన హీరోయిన్లను పెట్టుకుంటారు. ఆ పోర్షన్ చాలా సరదాగా నడిపిస్తారు. స్పైడర్ కూడా అంతే..ఇందులో కూడా హీరోయిన్ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. రకుల్ చాలా బాగా చేసింది అన్నాడు.

ఈ సమాధానం పూర్తయ్యాక కొన్ని నిమిషాలకు మళ్లీ తనంతట తానే మైక్ తీసుకుని.. మీకందరికీ ఒక విషయం. ఈ ప్రెస్ మీట్ చాలా ప్రత్యేకం. ఇందులో హారిస్ జైరాజ్ లాంటి ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నారు. మామూలుగా ఆయన ఇలాంటి ప్రెస్ మీట్లకు రారు. ఆయన రావడం అరుదైన విషయం. ఆయన్ని మీరంతా ఒక్క ప్రశ్న కూడా అడగట్లేదు. ఆయనేమో తన పాటికి తాను ఏదో వాట్సాప్ చేసుకుంటున్నారు.

,  ,  ,  ,