Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-May-2015 13:45:10
facebook Twitter Googleplus
Photo

తెలుగు సినిమాను కొత్తపుంతలు తొక్కించిన కథానాయకులలో కృష్ణ ముందువరుసలో కనిపిస్తాడు. ఒక వైపున కథానాయకుడిగా రికార్డు స్థాయిలో వరుస సినిమాలు చేస్తూ, మరో వైపున 'పద్మాలయ స్టూడియోస్' పేరుతో సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి, ఆ బ్యానర్ పై అనేక చిత్రాలని నిర్మించి అఖండమైన విజయాలను అందుకున్నాడు. ఇప్పుడు అదే బాటలో మహేష్ బాబు కూడా అడుగులు వేయనున్నట్టు సమాచారం అందుతోంది. తన కుమారుడు గౌతమ్ కృష్ణ పేరుతో 'గౌతమ్ ప్రొడక్షన్స్' అనే సొంత బ్యానర్ ని ఏర్పాటు చేయనున్నాడట.

మహేష్ అభిరుచికి తగిన సినిమాల నిర్మాణం ఈ బ్యానర్లో జరుగుతాయని అంటున్నారు. కొంతకాలం క్రితమే మహేష్ ఈ ఆలోచన చేసినా, అనుకోని కారణాల వలన ఆలస్యమవుతూ వచ్చింది. ఈ నెల 31న కృష్ణ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని మహేష్ - నమ్రత ఈ సొంత బ్యానర్ ని లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అదే నిజమైతే కృష్ణ లానే మహేష్ కూడా సొంత బ్యానర్ పై అద్భుతాలు సృష్టించాలని ఆశిద్దాం.

,  ,  ,  ,