వంశీ దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ మూవీ ఫ్యాషన్ డిజైనర్. మూడు దశాబ్దాల క్రితం చరిత్ర లేడీస్ టైలర్ కొడుకే ఈ ఫ్యాషన్ డిజైనర్. జూన్ 2న ఈ మూవీ విడుదల కానుండగా.. ప్రస్తుతం ప్రమోషన్స్ పీక్ స్టేజ్ లో ఉన్నాయి. ఫ్యాషన్ డిజైనర్ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్ లో ఒకరిగా నటించిన మనాలీ రాథోడ్.. తన పాత్రకు సంబంధించిన వివరాలు చెప్పింది.
వంశీ గారు చాలా స్ట్రిక్ట్ అంటూ చాలా మంది చెప్పిన మాటలు విని.. మొదటి రోజున భయంభయంగా సెట్స్ లో గడిపాను. కానీ కొన్ని గంటల్లోనే వంశీ స్టైల్ ఎలా ఉంటుందో తెలిసిపోయింది. ఆయనతో పని చేయడం ఓ అద్భుతం. ఇండస్ట్రీలో కొన్నేళ్ల కష్టం తర్వాత ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఈ సినిమా చేయడం నాకు వరం అన్న మనాలీ రాథోడ్.. తన పాత్ర గురించి కూడా వివరించింది. నేను చేసిన పాత్ర పేరు అమ్ములు. ఇంట్లోంచి కూడా బయటకు రాని అమాయకురాలు. అయినా సరే హీరో ఉచ్చులో పడిపోతుంది. అలా ఎలా అన్నదే ఈ చిత్రం. కానీ రియల్ లైఫ్ లో నేను కొంచెం నాటీ పర్సన్ ని' అని చెప్పింది మనాలీ.
మధుర శ్రీధర్ గారు ఓ రోజున నాకు ఫోన్ చేసి వంశీ సార్ ను కలవాలని చెప్పారు. సింపుల్ గా చీరకట్టుతో సంప్రదాయబద్ధంగా కనిపించాలన్నారు. అలా కలిశాను.. ఈ ఆఫర్ వచ్చింది అంటూ ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్ లో తనకు అవకాశం ఎలా వచ్చిందో కూడా చెప్పింది మనాలీ రాథోడ్