Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Nov-2017 10:10:14
facebook Twitter Googleplus
Photo

సినిమా తీయడం కంటే దాన్ని సజావుగా రిలీజ్ చేసుకోవడం పెద్ద టాస్క్ అయిపోతోంది. రోజు రోజుకూ సినిమాలు తీసేవారి సంఖ్య పెరుగుతుండగా.. థియేటర్లేమీ కొందరి దగ్గరే కేంద్రీకృతం అయిపోతూ విడుదల చాలా కష్టం అయిపోతోంది. పెద్ద సినిమాలు కొంచెం గ్యాప్ ఇవ్వగానే వారానికి మూణ్నాలుగు చిన్న-మీడియం రేంజి సినిమాల్ని థియేటర్లలోకి దించే ప్రయత్నం చేస్తున్నారు. గత వారం అలాగే మూడు సినిమాలు రిలీజవగా.. ఈ వారం నాలుగు సినిమాలు లైన్లో నిలిచాయి. ఇందులో మంచు మనోజ్ సినిమా ‘ఒక్కడు మిగిలాడు’ కూడా ఉంది. ఎప్పుడూ పూర్తయిన ఈ సినిమా ఇంత ఆలస్యంగా రావడానికి థియేటర్ల సమస్యే కారణమంటున్నాడు మనోజ్.

ఈ సినిమాకు చాలామంది కొత్తవాళ్లు.. కుర్రాళ్లు పని చేశారని.. దీంతో చాలా సమస్యలు తలెత్తాయని మనోజ్ తెలిపాడు. ఎన్నో కష్టాలకు ఓర్చి సినిమా పూర్తి చేస్తే విడుదల చాలా కష్టమైందన్నాడు. థియేటర్ల సమస్య దగ్గర్నుంచి అనేక ఇబ్బందులు తలెత్తడంతో టెన్షన్ పడాల్సి వచ్చిందన్నాడు. చిన్న సినిమాల విడుదల రోజు రోజుకూ కష్టమైపోతోందని.. ఈ విషయంలో ఒక వ్యవస్థ వచ్చి.. ఇబ్బందిని తొలగించాలని అతను అభిప్రాయపడ్డాడు. ఈ పరిస్థితి చూసే ఆవేశంతో తాను సినిమాలు వదిలేసి సొసైటీలోకి రావాలని అనుకున్నట్లు మనోజ్ చెప్పాడు. ఐతే తన అన్నయ్య వారించడంతో వెనక్కి తగ్గానన్నాడు.

,  ,  ,  ,  ,  ,